ఫార్ములా మారినా వీళ్లు మారరు!
మంచి యాక్షన్, కామెడీ, చమత్కారమైన సంభాషణలు ఉన్నా కానీ ఇటు దక్షిణాది స్టార్లను కలుపుకుని సినిమా తీస్తే అది బాగా వర్కవుటవుతుందని సూచిస్తున్నారు.
By: Tupaki Desk | 31 May 2025 4:00 AM ISTఇటీవలి కాలంలో మల్టీస్టారర్లకు కాస్టింగ్ ఎంపికల్ని పరిశీలిస్తే అన్ని భాషల నుంచి తారలను కలుపుకుని పని చేసేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. అన్ని భాషల్లో తెలిసిన ముఖాల కారణంగా, ఆయా భాషల్లో మార్కెట్ కూడా ప్రభావితం అవుతుంది. వార్ 2 లాంటి చిత్రంలో హృతిక్ తో పాటు, టైగర్ ని కాకుండా, ఎన్టీఆర్ ని తీసుకోవడం ఇలాంటి వ్యూహమే. యష్ రాజ్ ఫిలింస్ చాలా దిగి వచ్చి ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే, బాలీవుడ్ లో ఫ్రాంఛైజీ సినిమాల శైలి మారడం లేదని ఆవేదన నెలకొంది. ఇక్కడ కొనసాగింపు భాగాల్ని తెరకెక్కిస్తున్నారు. కానీ విజయాలు దక్కడం లేదు. ఇప్పుడు అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్, జాన్ అబ్రహం వంటి వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరోలను కలుపుతూ డిష్యూం కి సీక్వెల్ తీస్తారట.
ఇది సరైన నిర్ణయమేనా? అది కూడా షెహజాదా లాంటి ఫ్లాప్ సినిమా తీసిన దర్శకుడి(రోహిత్ ధావన్)కి అవకాశం కల్పించడం కూడా సరైన ఆలోచనేనా? అని ప్రశ్నిస్తున్నారు. డిష్యూం (2016) ఒక యాక్షన్ కామెడీ.. ఇది బ్లాక్‌బస్టర్ కాదు కానీ ఒకసారి చూడగలిగే చిత్రం. అక్షయ్ ఆ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించాడు. అతడి వల్ల మూవీకి ఇమేజ్ పెరిగింది. కానీ ఇప్పుడు సీక్వెల్ తీయాలనే ఆలోచన సరి కాదేమో! అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు పరిస్థితి వేరు. నాటి ప్రజల మైండ్ సెట్ తో పోలిస్తే, ఇటీవల మైండ్ సెట్ చాలా మారింది. నేటి ట్రెండ్ లో ప్రయత్నించకపోతే మరోసారి పరాభవం ఎదురవ్వడం ఖాయం.
మంచి యాక్షన్, కామెడీ, చమత్కారమైన సంభాషణలు ఉన్నా కానీ ఇటు దక్షిణాది స్టార్లను కలుపుకుని సినిమా తీస్తే అది బాగా వర్కవుటవుతుందని సూచిస్తున్నారు. దేనికైనా మంచి స్క్రిప్టు చాలా అవసరం. దానికోసం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది.
