Begin typing your search above and press return to search.

ఫోటోటాక్‌ : దిశా కిల్లింగ్‌ మిర్రర్‌ సెల్ఫీ

బాలీవుడ్‌లో ధోనీ సినిమా తర్వాత దిశా పటానీ బిజీగా మారింది. చైనీస్‌ మూవీ కుంగ్ ఫూ యోగా సినిమాలోనూ ఈ అందాల ముద్దుగుమ్మ నటించి మెప్పించింది.

By:  Tupaki Desk   |   8 July 2025 11:48 AM IST
ఫోటోటాక్‌ : దిశా కిల్లింగ్‌ మిర్రర్‌ సెల్ఫీ
X

టాలీవుడ్‌ మూవీ 'లోఫర్'తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ దిశా పటానీ. మొదటి సినిమా బాక్సాఫీస్‌ వద్ద తీవ్రంగా నిరాశ పరచడంతో తెలుగు ఫిల్మ్‌ మేకర్స్ ఈమెను పట్టించుకోలేదు. తెలుగు సినిమాల్లో ఆఫర్లు రాకపోవడంతో బాలీవుడ్‌లో ప్రయత్నాలు చేసింది. ఆ సమయంలో లక్కీగా 'ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ' సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఆ సినిమాలో పాత్ర చిన్నదైనా కీలకం కావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. పైగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే బాలీవుడ్‌లో ఒక్కసారిగా దిశా పటానీ బిజీ అయింది. ఆకట్టుకునే అందంతో పాటు, యాక్టింగ్‌ స్కిల్స్ ఉండటంతో లోఫర్‌ బ్యూటీ బిజీ అయింది.


బాలీవుడ్‌లో ధోనీ సినిమా తర్వాత దిశా పటానీ బిజీగా మారింది. చైనీస్‌ మూవీ కుంగ్ ఫూ యోగా సినిమాలోనూ ఈ అందాల ముద్దుగుమ్మ నటించి మెప్పించింది. అందంతో పాటు మార్షల్‌ ఆర్ట్స్‌ను చూపించడం ద్వారా సర్‌ప్రైజ్‌ చేసింది. బాఘీ 2 సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో దిశా పటానీ బాలీవుడ్‌లో తన స్థానంను మరింతగా పదిలం చేసుకుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ మంది స్టార్స్‌తో నటించే అవకాశాలు దక్కించుకుంది. సౌత్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దిశా పటానీ ఆ తర్వాత తెలుగు సినిమాల్లో నటించలేదు. కానీ దశాబ్ద కాలం తర్వాత తెలుగులో కల్కి సినిమాలో, తమిళ్‌లో కంగువా సినిమాలో నటించడం ద్వారా దిశా పటానీ సౌత్‌కి వచ్చింది.

కల్కి సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. అయితే సినిమాలో ఆమె పాత్ర మరీ పరిమితంగా ఉంది. దాంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేశారు, కంగువా డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో మళ్లీ ఈ అమ్మడు సౌత్‌లో నటించేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా సోషల్‌ మీడియాలో దిశా పటానీ అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. బాలీవుడ్‌లో అత్యధిక ఇన్‌స్టా ఫాలోవర్స్‌ కలిగి ఉన్న టాప్‌ స్టార్స్‌లో దిశా పటానీ ఒకరు అనడంలో సందేహం లేదు. తన అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్ సంఖ్య పెంచుకుంటూ, తన ఇమేజ్‌ను కాపాడుకుంటూ వస్తుంది.

తాజాగా మిర్రర్‌ సెల్ఫీని షేర్‌ చేసింది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ ఉన్న ముద్దుగుమ్మలు ఎవరైనా సోషల్‌ మీడియాలో ఫోటోలు షేర్‌ చేస్తే వైరల్‌ కావడం కామన్‌గా జరుగుతుంది. దిశా పటానీ మిర్రర్‌ సెల్ఫీలో తన అందాల ఆరబోత చేయడంతో చూపు తిప్పుకోనివ్వడం లేదు. క్లీ వేజ్‌ షో చేయడం తో పాటు, నడుము నాభి అందాలను చూపించడంతో నెటిజన్స్ నిమిషాల్లో లక్షల లైక్స్ ఇచ్చారు. సాధారణంగానే దిశా పటానీ ఫోటోలకు మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటిది ఇలా క్లీవేజ్ షో చేస్తూ నడుము నాభి అందాలను చూపించడం ద్వారా మరింతగా వైరల్‌ అవుతుంది. ఎప్పటిలాగే దిశా తన కిల్లింగ్‌ సెల్ఫీతో సోషల్‌ మీడియాను షేక్ చేస్తుంది. అందాల ఆరబోతలో ఇదే జోరు కొనసాగితే కచ్చితంగా త్వరలోనే ఈమె ఫాలోవర్స్ సంఖ్య వంద మిలియన్‌లకు చేరడం ఖాయం అని కొందరు కామెంట్‌ చేస్తున్నారు.