Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కోసం అన్నేళ్లు ఆ డైరెక్టర్ వెయిట్ చేస్తాడా..?

ఈ రెండు సినిమాలను పూర్తి చేశాక ప్రశాంత్ నీల్ సినిమా ఉంది. ఐతే లేటెస్ట్ గా యువ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కూడా ఒక పీరియాడికల్ కథతో ఎన్టీఆర్ ని కలిశాడని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   4 Feb 2024 12:30 PM GMT
ఎన్టీఆర్ కోసం అన్నేళ్లు ఆ డైరెక్టర్ వెయిట్ చేస్తాడా..?
X

కొరటాల శివతో దేవర సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఆ సినిమాను మొదట ఒకే పార్ట్ గా తీయాలని అనుకుని మధ్యలో రెండు భాగాలని ట్విస్ట్ ఇచ్చారు. సో ఇప్పుడు ఈ సినిమా కోసం రెండు భాగాల కోసం ఎన్టీఆర్ డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సినిమాతో పాటుగా బాలీవుడ్ లో వార్ 2 షూటింగ్ లో కూడా ఎన్టీఆర్ పాల్గొనాల్సి ఉంది. ఓ పక్క దేవర మరోపక్క వార్ 2 ఈ రెండు ప్రాజెక్ట్ ల మీద తారక్ స్పెషల్ ఫోకస్ పెట్టాడు.

ఈ రెండు సినిమాలను పూర్తి చేశాక ప్రశాంత్ నీల్ సినిమా ఉంది. ఐతే లేటెస్ట్ గా యువ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కూడా ఒక పీరియాడికల్ కథతో ఎన్టీఆర్ ని కలిశాడని తెలుస్తుంది. టాక్సీవాలా తో తొలి సినిమా సర్ ప్రైజ్ హిట్ అందుకున్న రాహుల్ సెకండ్ అటెంప్ట్ గా చేసిన నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా కూడా సూపర్ హిట్ అందుకుంది. ఈ రెండు సినిమాలతో డైరెక్టర్ గా తనకంటూ ఒక మార్క్స్ సెట్ చేసుకున్న రాహుల్ సంకృత్యన్ తన థర్డ్ అటెంప్ట్ గా భారీ ప్లానింగ్ లో ఉన్నాడు.

ఎన్టీఆర్ కోసం ఒక అద్భుతమైన కథ రెడీ చేశాడట రాహుల్ సంకృత్యన్ అయితే తారక్ ఈ సినిమాకు డేట్స్ ఇవ్వాలంటే ఎలా లేదన్నా సరే 3 ఏళ్లు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేవర రెండు భాగాలు.. వార్ 2 వీటితో పాటుగా ప్రశాంత్ నీల్ సినిమా కూడా లైన్ లో ఉంది. ఈ సినిమాలన్నీ పూర్తి చేయాలంటే ఎలా లేదన్నా 3 ఏళ్ల దాకా టైం పడుతుంది. మరి అప్పటివరకు రాహుల్ సంకృత్యన్ వెయిట్ చేస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

తారక్ కోసమే అన్నేళ్లు వెయిట్ చేయడం కష్టం కాబట్టి కచ్చితంగా రాహుల్ మరో కథతో వేరే హీరోతో సినిమా చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎన్.టి.ఆర్ నిజంగానే ఈ సినిమా చేసే ఛాన్స్ లేకపోతే మాత్రం మరో హీరోతో ఈ కథ తెరకెక్కించే ప్లాన్ చేస్తాడు. మరి రాహుల్ ఎన్టీఆర్ ఈ కాంబో తెర మీద చూసే అవకాశం ఉంటుందా లేదా అన్నది చూడాలి. స్టార్ హీరోలు కూడా కొత్త కొత్త కథలతో ఫ్యాన్స్ ని మెప్పించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో యువ దర్శకులతో పని చేయాలని చూస్తున్నారు.