Begin typing your search above and press return to search.

దేవిశ్రీ ప్రసాద్.. ఒకేసారి ఇన్ని సినిమాలా?

ఇక ఎవరు ఊహించని విధంగా శేఖర్ కమ్ముల ధనుష్ కాంబినేషన్ సినిమా కూడా దేవికి దక్కడం విశేషం. కచ్చితంగా దీనికి దేవి నుంచి బెస్ట్ ఆల్బమ్ వచ్చే ఛాన్స్ ఉంది.

By:  Tupaki Desk   |   5 March 2024 4:06 AM GMT
దేవిశ్రీ ప్రసాద్.. ఒకేసారి ఇన్ని సినిమాలా?
X

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. పుష్ప మూవీతో నేషనల్ అవార్డు సైతం అందుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా పుష్ప సాంగ్స్ ట్రెండ్ సృష్టించాయి. సోషల్ మీడియాలో షార్ట్స్ గా వైరల్ అయ్యాయి. మాస్ నుంచి క్లాస్ ఆడియన్స్ వరకు అందరికి పుష్ప సాంగ్స్ కనెక్ట్ అయ్యాయి.

అయితే పుష్ప మూవీ కోసం దేవిశ్రీ ప్రసాద్ చాలా సినిమాలు వదిలేసుకున్నాడు. మరల ఇప్పుడు సెలక్టివ్ గా ప్రాజెక్ట్స్ ఎంపిక చేసుకుంటున్నాడు. స్టార్ హీరోల చిత్రాలు, లేదంటే పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కి మాత్రమే దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం మ్యూజిక్ అందిస్తున్నాడు. దేవిశ్రీ సాంగ్స్ లో చాలా వరకు ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాయి.

క్లాస్, మాస్ ఏదైనా ప్రేక్షకులకి తన సంగీతంతో మాయ చేయడం దేవిశ్రీ ప్రసాద్ నైజం. ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప కంటే బెస్ట్ ఆల్బమ్ ఇవ్వాలని గట్టిగా ట్రై చేస్తున్నాడు. దీంతో పాటుగా బాలయ్య, బాబీ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.

తమిళంలో సూర్య, శివ కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ కంగువకి అదిరిపోయే మ్యూజిక్ ని దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన టీజర్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఉస్తాద్ భగత్ సింగ్ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వీరి కాంబో అంటే సూపర్ హిట్ ఆల్బమ్ గ్యారెంటీ అని చెప్పొచ్చు.

నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ తండేల్ కి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సరికొత్త జోనర్ లో రియలిస్టిక్ సంఘటనల స్ఫూర్తిగా ఈ కథని సిద్ధం చేసి తెరపై ఆవిష్కరిస్తున్నారు. ఇక ఎవరు ఊహించని విధంగా శేఖర్ కమ్ముల ధనుష్ కాంబినేషన్ సినిమా కూడా దేవికి దక్కడం విశేషం. కచ్చితంగా దీనికి దేవి నుంచి బెస్ట్ ఆల్బమ్ వచ్చే ఛాన్స్ ఉంది. దేవిశ్రీ చేతిలో అరడజను సినిమాలు ప్రస్తుతం ఉన్నాయి. ఈ సినిమాలతో మరల వింటేజ్ డిఎస్పీని గుర్తు చేస్తాడేమో వేచి చూడాలి.