Begin typing your search above and press return to search.

రూల్స్ రంజాన్.. ముంబై సౌండ్!

ముంబయి నగరంలో తెలుగు సోల్ అంటూ పాటను పరిచయం చేశారు. ఈ పాటలో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి స్టెప్స్ అదరిపోయాయి.

By:  Tupaki Desk   |   19 Sep 2023 6:39 AM GMT
రూల్స్ రంజాన్.. ముంబై సౌండ్!
X

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం రూల్స్ రంజన్. ఈ సినిమాలో కిరణ్ సరసన డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే, ఈ మూవీ కామెడీ కోణంలో సాగుతుందనే విషయం అర్థమైంది.


ఇక, ఈ మూవీ నుంచి గతంలో మూడు పాటలు విడుదల చేశారు. వాటిలో సమ్మెహనుడా పాట బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ పాటకు స్టెప్పులు వేయనివారు లేరు. ఈ పాటతో నేహా శెట్టి అందానికి మరింత క్రేజ్ పెరిగింది. కాగా, తాజాగా ఈ మూవీ నుంచి నాలుగో సింగిల్ విడుదల చేశారు. ముంబయి దేఖో అంటూ సాగే పాట అది.

ముంబయి నగరంలో తెలుగు సోల్ అంటూ పాటను పరిచయం చేశారు. ఈ పాటలో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి స్టెప్స్ అదరిపోయాయి. నేహా శెట్టి జీన్స్ లో తన నడుము అందాలను కనిపించేలా హైలెట్ చేయడం విశేషం. మ్యూజిక్ డైరెక్టర్ అమ్రిష్ స్వరపరిచిన ఈ పాటని ప్రముఖ సింగర్ అద్నాన్ సమీ, పాయల్ దేవ్ ఆలపించారు. కాసర్ల శ్యామ్, మేఘరాజ్ రవీంద్ర సాహిత్యం అందించారు.

సింగర్ అద్నాన్ సమి చాలా కాలం తర్వాత మళ్లీ ఈ మూవీలో పాట పాడటం విశేషం. ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దివ్యాంగ్ లావణ్య, మురళీకృష్ణ వేమూరి ఈ మూవీకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఈ మూవీలో సరికొత్త కిరణ్ అబ్బవరం కనిపిస్తాడని చిత్ర బృందం చెబుతోంది.. మూవీ లో మంచి ప్రేమ కథతో పాటు, ఆకట్టుకునే కథ కూడా ఉంటుందని, ప్రేక్షకులు మనసారా నవ్వుకునేలా, మంచి ఎంటర్ టైన్మెంట్ అవుతుందని మూవీ టీమ్ ధీమా గా ఉంది. ఇక, ఈ మూవీ అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.