రిలీజ్ ముందే ‘కపుల్ ఫ్రెండ్లీ’ షోలు.. నిర్మాత ఏమన్నారంటే..
టాలీవుడ్‌లో ఈమధ్య కొందరు నకర్మాతలు రిలీజ్ కంటే ముందే ప్రీమియర్స్ వేయడం అలవాటుగా మారుతోంది.
By: Tupaki Desk | 10 Feb 2026 3:53 PM ISTటాలీవుడ్‌లో ఈమధ్య కొందరు నకర్మాతలు రిలీజ్ కంటే ముందే ప్రీమియర్స్ వేయడం అలవాటుగా మారుతోంది. టాక్ బాగుంటే ప్లస్ అవుతోంది. లేదంటే యావరేజ్ టాక్ వచ్చినా వర్కౌట్ కావడం లేదు. ఇక ఇప్పుడు సంతోష్ శోభన్, మానస వారణాసి నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ విషయంలో నిర్మాత ధీరజ్ మొగిలినేని ప్రీమియర్ ఫార్ములా ఫాలో అవుతున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న సినిమా రాబోతుండగా, అంతకంటే ముందే ప్రేక్షకులకు సినిమా చూపించడానికి ఆయన సిద్ధమయ్యారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలను ధీరజ్ రీసెంట్ ప్రెస్ మీట్‌లో వివరించారు.
సాధారణంగా చిన్న సినిమాలకు ప్రీమియర్స్ వేయడం అనేది ఒక రిస్కీ స్టెప్. టాక్ గనుక తేడా వస్తే మొదటి రోజు ఓపెనింగ్స్ మీద దెబ్బ పడుతుంది. కానీ ధీరజ్ మాత్రం ఈ విషయంలో చాలా బోల్డ్ గా ఉన్నారు. ఫిబ్రవరి 13వ తేదీ సాయంత్రమే నైజాం ఏరియాలోని ప్రధాన థియేటర్లలో ‘పెయిడ్ ప్రీమియర్స్’ ప్లాన్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సినిమా కంటెంట్ మీద ఉన్న బలమైన నమ్మకమే తనను ఈ నిర్ణయం తీసుకునేలా చేసిందని ఆయన చెప్పుకొచ్చారు.
అసలు పాయింట్ ఏంటంటే.. "సినిమా చూశాక ఆడియన్స్ ఇచ్చే మౌత్ టాక్ మీద నాకు పూర్తి భరోసా ఉంది, మంచి ఓపెనింగ్స్ కోసమే ఒక రోజు ముందే షోలు వేస్తున్నాము. కంటెంట్ మీద నమ్మకం ఉంది. కంటెంట్ మీద నమ్మకం లేకుంటే అలా చేయకూడదు. ఎందుకంటే పాజిటివ్ టాక్ వస్తే ఎంత వేగంగా స్ప్రెడ్ అవుతుందో, నెగిటివ్ టాక్ వచ్చినప్పుడు కూడా అంతే వేగంగా జనాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. మేము మాత్రం కంటెంట్ మీద నమ్మకంతోనే షోలు వేస్తున్నాం" అని ధీరజ్ స్పష్టం చేశారు.
ప్రీమియర్స్ ద్వారా వచ్చే పాజిటివ్ వైబ్ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు ఇలాగే ప్రీమియర్స్ తో సూపర్ హిట్ అయ్యాయి. అదే మ్యాజిక్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుందని, ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక సెన్సార్ బోర్డ్ నుంచి ‘A’ సర్టిఫికేట్ వచ్చినా సరే, అది కేవలం టైటిల్ వల్లే వచ్చిందని.. సినిమాలో ఎలాంటి ఇబ్బందికర సీన్లు లేవని ధీరజ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు.
ఇక సర్టిఫికేట్ గురించి ఆలోచించకుండా, నేరుగా ఆడియన్స్ జడ్జిమెంట్ కే వదిలేయాలని డిసైడ్ అయ్యారని అర్ధమవుతుంది.
నైజాం మార్కెట్ లో ఈ సినిమాను ధీరజ్ సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ గా తను తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కేవలం బిజినెస్ మాత్రమే కాదు, ఒక మంచి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలనే కసి కూడా ఉందని ఆయన మాటల్లో అర్థమవుతోంది. ప్రీమియర్స్ కి వచ్చే రెస్పాన్స్ ని బట్టి రిలీజ్ రోజు థియేటర్ల కౌంట్ పెంచే ఆలోచనలో కూడా టీమ్ ఉంది. ఫిబ్రవరి 13 సాయంత్రం నుంచే ఈ సినిమా టాక్ ఏంటో తెలిసిపోనుంది. ఒక నిర్మాత తన సినిమా మీద ఇంత ఓపెన్ గా కాన్ఫిడెన్స్ చూపిస్తుండటంతో ఫిలిం నగర్ లో కూడా ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి పెరిగింది. మరి ధీరజ్ నమ్మినట్లుగా ఈ ప్రీమియర్స్ సినిమాకు ఏ రేంజ్ లో హెల్ప్ అవుతాయో చూడాలి.
