Begin typing your search above and press return to search.

కూలీ పోటీలో ఉన్నాడా..?

కూలీ సినిమాకు పోటీగా ఈసారి ఎన్ టీ ఆర్, హృతిక్ రోషన్ వార్ 2 వస్తుంది. ఈ రెండు సినిమాల మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది.

By:  Tupaki Desk   |   28 April 2025 11:30 PM
కూలీ పోటీలో ఉన్నాడా..?
X

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కూలీ. ఖైదీ, విక్రం, లియో సినిమాలతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి సూపర్ క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ యూనివర్స్ లోకి సూపర్ స్టార్ రజినీని కూడా తెస్తున్నాడు లోకేష్. రజిని కూలీ సినిమా ముగింపు దశలో ఉందని తెలుస్తుంది. ఐతే ఈ సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

అసలైతే రజినీకాంత్ కూలీ సినిమాను ఆగష్టు 14న రిలీజ్ ఫిక్స్ చేశారు. అసలైతే సమ్మర్ రిలీజ్ అనుకున్న ఈ సినిమా కాస్త ఆగష్టుకి వెళ్లింది. ఐతే అనుకున్నట్టుగా ఆగష్టు 14కి సినిమా వస్తుందా లేదా అన్న డౌట్ మొదలైంది. ఎందుకంటే ఆగష్టు 14న హృతిక్ రోషన్, ఎన్ టీ ఆర్ కలిసి నటిస్తున్న వార్ 2 రిలీజ్ అవుతుంది. ఆ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో భారీగా రిలీజ్ చేస్తున్నారు.

కూలీ సినిమాకు పోటీగా ఈసారి ఎన్ టీ ఆర్, హృతిక్ రోషన్ వార్ 2 వస్తుంది. ఈ రెండు సినిమాల మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది. ఐతే రజినీ కూలీ రిలీజ్ విషయంపై ఎలాంటి అప్డేట్స్ ఇవ్వట్లేదు. లోకేష్ ఇదివరకు సినిమాల కన్నా కూలీ మీద స్పెషల్ ఫోకస్ చేస్తున్నాడు. రజినీ కూలీ సినిమాలో మన టాలీవుడ్ కింగ్ నాగార్జున తో పాటు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా నటిస్తున్నారు. ఈ ఇద్దరి పాత్రలు కూడా సినిమాలో సర్ ప్రైజింగ్ గా ఉంటాయని తెలుస్తుంది.

ఒకవేళ ఆగష్టు 14న వార్ 2 కి పోటీగా వచ్చినా అక్కడ రజినీకాంత్ కి తోడుగా నాగార్జున, ఉపేంద్రలు కూడా ఉన్నారు కాబట్టి టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పొచ్చు. రజినీకాంత్ కూలీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని చిత్ర యూనిట్ అంటున్నారు. జైలర్ తో సూపర్ కంబ్యాక్ ఇచ్చిన రజినీకాంత్ కూలీ తో నెక్స్ట్ లెవెల్ సక్సెస్ అందుకుంటాడని అంటున్నారు. ఐతే ఫ్యాన్స్ మాత్రం సినిమా నుంచి అప్డేట్స్ రావట్లేదన్న విషయంలో అప్సెట్ గా ఉన్నారు. మరి లోకేష్ కూలీ అప్డేట్స్ పై కాస్త దృష్టి పెడితే బాగుంటుందని చెప్పొచ్చు. కూలీ, వార్ 2 పోటీ పడ్డా రెండు వేరు వేరు జోనర్ సినిమాలు కాబట్టి ఇబ్బంది ఉండదు. అంతేకాదు సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ గా ఈ ఫైట్ ని చెప్పుకోవచ్చు.