Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో కూలీ పికప్.. వార్ 2 కు డేంజర్ బెల్స్?

ఈ రెండు సినిమాలు ఆగస్టు 14 నే రిలీజ్ కానున్నాయి. ఇటు కూలీ, అటు వార్ రెండింటిపైనా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రేక్షకుల్లోనూ ఆత్రుత ఎక్కువుతోంది.

By:  Tupaki Desk   |   19 July 2025 12:07 PM IST
బాలీవుడ్ లో కూలీ పికప్.. వార్ 2 కు డేంజర్ బెల్స్?
X

ఇండియన్ బాక్సాఫీస్ గత కొన్ని నెలలుగా సైలెంట్ గా ఉంది. పెద్ద సినిమాలు లేక వెలవెలబోయింది. ఈ కరువంతా వచ్చే నెలలో తీరనుంది. రెండు భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ ముందుకు రానున్నాయి. రెండు సినిమాు సై అంటే సై అంటూ ఢీ కొట్టనున్నాయి. అవేవో కాదు ఒకటి రజినీకాంత్ కూలీ మరొకటి హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వార్-2.

ఈ రెండు సినిమాలు ఆగస్టు 14 నే రిలీజ్ కానున్నాయి. ఇటు కూలీ, అటు వార్ రెండింటిపైనా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రేక్షకుల్లోనూ ఆత్రుత ఎక్కువుతోంది. అయితే తొలి నుంచీ నార్త్ లో వార్ 2 సినిమాదే హవా ఉంటుందని భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. నార్త్ బెల్ట్ లోనూ కూలీ స్క్రీన్ షేర్ పెరుగుతోంది.

8 వారాల తర్వాతే ఓటీటీలో వచ్చేలా కూలీ మేకర్స్ డీల్ కుదుర్చుకోవడంతో ఈ సినిమాకు నార్త్ లో భారీగానే స్క్రీన్లు దక్కనున్నాయి. ఆ అగ్రిమెంట్ తో నేషనల్ చైన్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు కూలీ వైపు మొగ్గు చూపిస్తున్నాయి. దీంతో నార్త్ లో వార్ 2కు కూలీ సినిమా గట్టి పోటీ ఇవ్వడం పక్కా. అలాగే ఓపెనింగ్ డే టాక్ పాజిటివ్ గా ఉంటే బాలీవుడ్ లోనూ దీనికి ఆదరణ పెరుగుతుంది. ఇది వర్కౌట్ అయితే నార్త్ మార్కెట్ లోనూ కూలీ- వార్ 2 మధ్య బాక్సాఫీస్ ఫైట్ తీవ్రంగా ఉండనుంది.

మరోవైపు సౌత్ లో చూసుకుంటే ఇక్కడా ఈ రెండు సినిమాల మధ్య పోటీ బాగానే ఉంది. రజినీకాంత్ మార్క్ ఓ వైపు ఉంటే వార్ 2లో ఎన్టీఆర్ ఉండడం బాక్సీఫీస్ ఫైట్ ను హీటెక్కిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్ ఫాలోయింగ్ కు ఎన్టీఆర్ కు సాటిలేదు. అయితే అటు రజినీకాంత్ కు సైతం ఇక్కడ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. దానికి తోడు కూలీలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషించడం ప్లస్ పాయింట్ కానుంది.

ఈ లెక్కల ప్రకారం నార్త్ అండ్ సౌత్ ఓవరాల్ గా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కూలీ వర్సెస్ వార్ 2 ఫైట్ నడవడం పక్కాగా కనిపిస్తుంది. ఒకవేళ ఓపెనింగ్ టాక్ బాగుంటే మాత్రం ఈ సినిమాలు కాసుల వర్షం కురిపించడం పక్కా. మరి ఈ పోటీ ఎవరికి కలిసొస్తుంది? ఎవరు బాక్సాఫీస్ కింగ్ కానున్నారో తెలియాలంటే వచ్చే నెల 14దాకా ఆగాల్సిందే!