బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్.. మరో 30 రోజుల్లో..
సాధారణంగా బడా హీరోల సినిమాలు అప్పుడప్పుడు ఒకే రోజు లేదా రోజుల గ్యాప్ లో విడుదల అవుతుంటాయి.
By: Tupaki Desk | 15 July 2025 5:00 PM ISTసాధారణంగా బడా హీరోల సినిమాలు అప్పుడప్పుడు ఒకే రోజు లేదా రోజుల గ్యాప్ లో విడుదల అవుతుంటాయి. బాక్సాఫీస్ వద్ద గట్టిగా పోటీ కూడా పడుతుంటాయి. ఇప్పుడు మరో 30 రోజుల్లో అలాంటి బిగ్ క్లాషే జరగనుంది. ఆగస్టు 15వ తేదీన కూలీ, వార్ 2 చిత్రాలు.. ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ కానున్నాయి.
కూలీ విషయానికొస్తే.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ లీడ్ రోల్ లో లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ రూపొందిస్తున్నారు. సినిమా కోసం పెద్ద ఎత్తున క్యాస్టింగ్ ను రంగంలోకి దించారు మేకర్స్. టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తదితరులు నటిస్తున్నారు.
ఇప్పటికే కూలీ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. అప్డేట్స్ తో ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు. దీంతో సినిమా కోసం మూవీ లవర్స్, ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. కచ్చితంగా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అని అంచనా వేస్తున్నారు.
మరోవైపు, వార్-2తో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. హృతిక్ రోషన్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది. స్పై జోనర్ లో వస్తున్న సినిమాతోపాటు తారక్ బీటౌన్ డెబ్యూ కావడంతో అంతా మంచి అంచనాలు పెట్టుకున్నారు.
ప్రమోషన్స్ విషయంలో కూలీదే కాస్త పై చేయి అయినప్పటికీ.. సీక్వెల్ కాబట్టి బెనిఫిట్స్ ఉంటాయి. హృతిక్, తారక్ వంటి బడా హీరోలు నటిస్తుండడంతో హైప్ నేచురల్ గానే క్రియేట్ అవుతుంది. అదే సమయంలో ప్రమోషన్స్ వినూత్నంగా చేసి బజ్ ఫుల్ గా క్రియేట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏదేమైనా బాక్సాఫీస్ వద్ద మాత్రం రెండు సినిమాలు గట్టిగానే పోటీపడతాయి. ఒకటి బాలీవుడ్ చిత్రం.. మరొకటి కోలీవుడ్ మూవీ అయినప్పటికీ.. తారక్, నాగార్జున ఆయా సినిమాల్లో ఉండడంతో రెండింటికీ ప్లస్సే. మరి ఏ సినిమా ఎలా ఉంటుందో.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో అంతా వేచి చూడాలి.
