Begin typing your search above and press return to search.

అక్కడ 'కూలీ' ముందు తేలిపోతున్న వార్-2

ఈ ఇండిపెండెన్స్ డే వీకెండ్లో ఇండియన్ బాక్సాఫీస్‌లో మెగా క్లాష్ చూడబోతున్నాం. తమిళం నుంచి ‘కూలీ’, హిందీ నుంచి ‘వార్-2’ భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్నాయి.

By:  Tupaki Desk   |   29 July 2025 8:15 AM IST
అక్కడ కూలీ ముందు తేలిపోతున్న వార్-2
X

ఈ ఇండిపెండెన్స్ డే వీకెండ్లో ఇండియన్ బాక్సాఫీస్‌లో మెగా క్లాష్ చూడబోతున్నాం. తమిళం నుంచి ‘కూలీ’, హిందీ నుంచి ‘వార్-2’ భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్నాయి. వీటి క్రేజ్ ఒక భాషకు పరిమితం కాదు. పాన్ ఇండియా స్థాయిలో ఇవి సందడి చేయబోతున్నాయి. ఐతే కాంబినేషన్ క్రేజ్, ఎగ్జైటింగ్ ప్రోమోలతో ‘కూలీ’నే హైప్ పరంగా ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇండియాలో బుకింగ్స్ మొదలు కావడానికి ఇంకా చాలా టైం ఉంది కానీ.. ఈలోపు యుఎస్‌లో ఈ రెండు చిత్రాలకూ టికెట్ల అమ్మకాలు మొదలయ్యాయి.

అక్కడ ‘కూలీ’ దూకుడు ముందు ‘వార్-2’ అస్సలు నిలిచేలా కనిపించడం లేదు. విడుదలకు మూడు వారాల సమయం ఉండగానే ‘కూలీ’ యుఎస్‌లో హాఫ్ మిలియన్ క్లబ్బులోకి అడుగు పెట్టేయడం విశేషం. ఈ సినిమాకు బుకింగ్స్ మొదలైనప్పటి నుంచి టికెట్లు శరవేగంగా అమ్ముడవుతున్నాయి. అప్పుడే హఫ్ మిలియన్ అంటే.. ప్రిమియర్స్‌తోనే సినిమా మిలియన్ డాలర్లు కొల్లగొట్టడం లాంఛనమే.

సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే వీకెండ్లోనే మూణ్నాలుగు మిలియన్ డాలర్లు వసూలు చేయడం పక్కా. ఐతే ‘వార్-2’కు మాత్రం యుఎస్‌లో ప్రస్తుతానికి అంత డిమాండ్ కనిపించడం లేదు. పరిమిత లొకేషన్లలోనే టికెట్ల అమ్మకాలు మొదలు కాగా.. టికెట్లు నెమ్మదిగా తెగుతున్నాయి. అమ్మకాలు 5 వేల డాలర్లకు చేరువగా ఉన్నాయంతే. ఐతే పూర్తి స్థాయిలో బుకింగ్స్ మొదలైతే ప్రి సేల్స్ ఎలా ఉంటాయో చూడాలి. ప్రస్తుతానికి అయితే సినిమాకు డిమాండ్ తక్కువగానే కనిపిస్తోంది.