రజినీ 'కూలీ'.. తారక్ 'వార్-2'కు అది సాధ్యమా?
ఒకేరోజు కూలీ, వార్-2 సినిమాలు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్నాయి. రెండూ కూడా పాన్ ఇండియా రేంజ్ లో సందడి చేయనున్నాయి.
By: Tupaki Desk | 20 July 2025 12:00 AM ISTఆగస్టు 14వ తేదీన బాక్సాఫీస్ వద్ద పెద్ద క్లాష్ జరగనున్న విషయం తెలిసిందే. ఒకేరోజు కూలీ, వార్-2 సినిమాలు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్నాయి. రెండూ కూడా పాన్ ఇండియా రేంజ్ లో సందడి చేయనున్నాయి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఆడియన్స్ ను అలరించేందుకు వెయిట్ చేస్తున్నాయి.
కూలీ సినిమాలో కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ లీడ్ రోల్ లో నటించగా.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యదేవ్, శృతిహాసన్ తదితరులు సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మరోవైపు, వార్-2లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. కియారా అడ్వాణీ హీరోయిన్ గా కనిపించనుండగా.. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. YRF స్పై యూనివర్స్ లో భాగంగా వస్తున్న మూవీని యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.
అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో రెండు సినిమాల మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. అందులో భాగంగా వార్ 2 థియేట్రికల్ ట్రైలర్ జులై 23వ తేదీన రిలీజ్ అవ్వనుంది. మరోవైపు కూలీ ట్రైలర్ ఆగస్టు 2న విడుదల కానుంది. అలా ఒకే రోజు విడుదలవ్వనున్న చిత్రాల ట్రైలర్స్ రిలీజ్ కు 20 రోజుల గ్యాప్ ఉండనుంది.
అదే సమయంలో వార్-2 కన్నా కూలీ మూవీపై ఎక్కువ హైప్ ఉందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. అందుకు రకరకాల కారణాలు ఉన్నా అది మాత్రం నిజమే. దీంతో కూలీ ట్రైలర్ కన్నా 20 రోజుల ముందు వార్-2 ట్రైలర్ వస్తుండడంతో మేకర్స్ దానితో భారీ హైప్ క్రియేట్ చేయాలి. అదే మంచి అవకాశమని చెప్పాలి.
ట్రైలర్ తర్వాత సాంగ్స్ తోపాటు భారీ ప్రమోషనల్ ఈవెంట్ తో మేకర్స్ బజ్ ను కొనసాగించాలి. ఆగస్టు 2న కూలీ ట్రైలర్ విడుదలైన తర్వాత కూడా కొత్త ప్రమోషనల్ టీజర్ లు లేదా పాటల విడుదలతో సందడి చేయాలి. అప్పుడే కూలీ హైప్ తో ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మొత్తమ్మీద ప్రమోషన్లతో కూడా పోటీ పడాలి. మరి బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.
