కూలి తెలుగు రైట్స్.. ఇది కాస్త రిస్కే..
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ సినిమా కూలి.
By: Tupaki Desk | 10 Jun 2025 3:15 PM ISTలోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ సినిమా కూలి. ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్‌తో భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమాపై నాలుగు భాషల అభిమానుల్లో బజ్ ఊపందుకుంది. లోకేష్ మార్క్ యాక్షన్, మాస్ వేరియేషన్‌కి రజనీ స్టైల్ కలగలిపితే ఎలా ఉంటుందో చూడాలని సినీప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాతో నాగార్జున చాలా రోజుల తర్వాత తమిళంలో మళ్లీ సందడి చేయబోతున్నాడు. ఇందులో ఆయన క్యారెక్టర్ కు స్పెషల్ మాస్ షేడ్స్ ఉన్నట్లు టాక్. రజనీకి విలన్‌గా నటిస్తున్న నాగ్, కన్నడ హీరో ఉపేంద్ర పాత్రలు కూడా ఫ్యాన్స్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కైది, విక్రమ్, లియో లాంటి సినిమాల తర్వాత లోకేష్ మల్టీ హీరో స్క్రిప్ట్ ఎలా డిజైన్ చేశాడనే క్యూరియాసిటీ ఇప్పటికే పీక్స్‌కి వెళ్లిపోయింది.
ఇలా బజ్ ఉన్న ఈ సినిమాకు సంబంధించిన తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం టాలీవుడ్‌లో ఉన్న టాప్ డిస్ట్రిబ్యూటర్లు గట్టిగానే పోరాటం చేస్తున్నారు. దిల్ రాజు, ఆసియన్ సునీల్, సితార నాగవంశీ, అన్నపూర్ణ స్టూడియోస్ వంటి వారంతా ఈ రైట్స్‌ను సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పోటీని గమనించిన నిర్మాతలు ఆశతో, తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే థియేటర్ల కోసం జీఎస్టీ మినహాయించి రూ. 45 కోట్లు డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే కొన్ని సంస్థలు జీఎస్టీ మినహాయించి 36 కోట్లు, ఇంకొంతమంది జీఎస్టీతో కలిపి 43 కోట్లు వరకు ఆఫర్ చేసారని సమాచారం. కానీ నిర్మాతలు మాత్రం కనీసం జీఎస్టీ మినహాయించి 40 కోట్లకు పైగా ధర రావాలని ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో ఈ ఏడాది ఆగస్టు 14న ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో వస్తున్న వార్ 2 కూడా రిలీజ్ కాబోతుండటంతో, ఈ రైట్స్ కొనడంలో కొంత రిస్క్ ఉన్నదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
వార్ 2 ఒక పాన్ ఇండియా ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడం, ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ కావడం, హృతిక్ రోషన్ ఫ్యాన్ బేస్ ఉండడం వలన ఇలా అన్నీ కోణాల్లో తీవ్రమైన పోటీని కలిగిస్తాయి. రెండు నెలల ముందే వార్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలవ్వడం, థియేటర్లు ముందుగానే బ్లాక్ అవ్వడం కూడా కూలీని బయ్యర్లకు తలనొప్పిగా మారుస్తోంది.
కానీ గతంలో విక్రమ్, లియో లాంటి లోకేష్ సినిమాలు తెలుగులో మాస్ లాభాలు అందించడంతో ఆయనపై విశ్వాసం ఉందని ట్రేడ్ అంటోంది. జైలర్ సినిమా కూడా రజనీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడంతో నిర్మాతలు అత్యధిక ధరను ఆశించడంలో తప్పేమీ లేదని చెబుతున్నారు. కానీ అదే సమయంలో ఇది రిస్కే అన్న వాస్తవాన్ని గమనించాల్సిందే. ఇప్పుడు ఈ బేరంలో ఎవరు గెలుస్తారో, ఎవరు నష్టపోతారో చూడాలి.