Begin typing your search above and press return to search.

'కూలీ' పోస్టర్.. అలా అంటున్నారేంటి?

ఎందుకంటే ఇప్పటికే బాలీవుడ్ మూవీ వార్-2 మేకర్స్ తోపాటు ఐమ్యాక్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సినిమా కూడా ఆగస్టు 14వ తేదీన రిలీజ్ కానుంది.

By:  Tupaki Desk   |   5 July 2025 9:53 PM IST
కూలీ పోస్టర్.. అలా అంటున్నారేంటి?
X

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రూపొందుతున్న కూలీ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ గా రెడీ అవుతున్న ఆ సినిమా.. ఆగస్టు 14వ తేదీన వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా రేంజ్ లో సందడి చేయనుంది.

అయితే కూలీ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తుండగా.. పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో సందడి చేయనున్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనతోపాటు ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్ యాక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా నటిస్తున్నారు.

అమీర్ నటిస్తున్న విషయాన్ని అనౌన్స్ చేస్తూ.. మేకర్స్ రీసెంట్ గా పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ సమయంలో ఐమ్యాక్స్ లోనూ రిలీజ్ చేస్తామని పోస్టర్ లో మెన్షన్ చేశారు. ఇప్పుడు ఆ విషయమే చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. ఐమ్యాక్స్ ఫార్మాట్ లో కూలీ మూవీ విడుదల అవ్వడానికి ఇంకా డీల్ ఫిక్స్ అవ్వలేదట.

ఎందుకంటే ఇప్పటికే బాలీవుడ్ మూవీ వార్-2 మేకర్స్ తోపాటు ఐమ్యాక్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సినిమా కూడా ఆగస్టు 14వ తేదీన రిలీజ్ కానుంది. దీంతో వేరే సినిమా ఆ రోజు ఐమ్యాక్స్ ఫార్మాట్ లో విడుదల అయ్యే అవకాశం లేదు. అయినప్పటికీ.. పోస్టర్ లో కూలీ మేకర్స్ ఐమ్యాక్స్ లోగోను వేశారు.

ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఐమ్యాక్స్ బ్రాండింగ్ నియమాలకు కూలీ మూవీ పోస్టర్ విరుద్ధంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఇటువంటి చర్యలు.. పరిశ్రమ పద్ధతుల పట్ల గౌరవం గురించి ప్రశ్నలను లేవనెత్తుతాయని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఐమ్యాక్స్ తో చర్చలు జరుపుతున్నా.. లోగో ఉపయోగించకూడదని అంటున్నారు.

ఒప్పందం కుదరకుండా లోగో వేస్తే ప్రేక్షకులను తప్పుదారి పట్టించినట్లు అవుతుందని చెబుతున్నారు. ఏదేమైనా మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటం ప్రాధాన్యమని అంటున్నారు. ముఖ్యంగా ఐమ్యాక్స్ వంటి విషయాల్లో కరెక్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు. ఏదేమైనా ఐమ్యాక్స్ ఇష్యూ విషయంలో కూలీ మేకర్స్ కే అసలు విషయం తెలియాలి.