Begin typing your search above and press return to search.

సూర్యతో తెలుగోడి మైథాలజీ మ్యాజిక్..

ఫాంటసీ, థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించడంలో ఓ స్పెషల్ ఇమేజ్​ను క్రియేట్ చేసుకున్నారు దర్శకుడు చందూ మొండేటి

By:  Tupaki Desk   |   23 Aug 2023 5:01 AM GMT
సూర్యతో తెలుగోడి మైథాలజీ మ్యాజిక్..
X

ఫాంటసీ, థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించడంలో ఓ స్పెషల్ ఇమేజ్​ను క్రియేట్ చేసుకున్నారు దర్శకుడు చందూ మొండేటి. ప్రస్తుతం అక్కినేని హీరో నాగ చైతన్యతో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్నారు. త్వరలోనే ఇది సెట్స్​పైకి వెళ్లనుంది. అయితే ఈ చిత్రం తర్వాత ఆయన.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్​ ఆఫర్​ను అందుకున్నారు.

మైథాలజీ, ఫాంటసీ, సోషల్ థీమ్స్​ నేపథ్యంలో సినిమా ఉంటుందని తెలిసింది. నాలుగు వేదాలు(రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం) ఆధారంగా డిఫరెంట్ కాన్సెప్ట్​తో కథను సిద్ధం చేసినట్లు చందు అన్నారు. ఆధ్యాత్మిక, తాత్విక అంశాలను సినిమాలో చూపించబోతున్నారని తెలిపారు.

ఇకపోతే తెలుగు దర్శకులతో చేసేందుకు సూర్య ఎప్పటి నుంచో ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు ఇక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ మార్కెట్ ఉంది. కానీ సరైన కాంబినేషన్ దొరిక కుదరలేదు. అందుకే స్ట్రైట్ సినిమాలు చేయలేకపోతున్నారు. ఇక ఇప్పుడు చాలా కాలం తర్వాత చందూ మొండేటి ఫాంటసీ సబ్జెక్ట్​తో వచ్చేందుకు రెడీ అయ్యారు.

అయితే సూర్య ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన భారీ హిస్టారికల్​ డ్రామా 'కంగువ' ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే అభిమానుల ముందుకు రానుంది. దీని తర్వాత వెట్రిమారన్ వడి వాసల్​తో పాటు మరో రెండు ప్రాజెక్టులు లైన్​లో ఉన్నాయి. ఈలోగా చందూ మొండేటి.. నాగచైతన్యతో చేయబోతున్న 'తండేల్'(ప్రచారంలో ఉన్న పేరు) పూర్తి చేసుకుని 'కార్తికేయ 3'కి రెడీ అవుతున్నారని తెలిసింది. మరి ఇది కూడా పూర్తి చేసి సూర్యతో మొదలుపడతారా లేదంటే ముందుగానే మొదలుపెడతారా అనేది క్లారిటీ లేదు.

తండేల్ కోసం ఇటీవలే చైతూ-చందుతో పాటు ఇతర మూవీటీమ్​ సభ్యులు.. నది తీర ప్రాంతాలకు వెళ్లి జాలర్ల జీవన విధానాన్ని తెలుసుకున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్​లో ఈ చిత్రం అత్యధిక బడ్జెట్​తో తెరకెక్కుతోంది. త్వరలోనే సెట్స్​పైకి వెళ్లి రెగ్యులర్ షూటింగ్​ ప్రారంభించుకోనుంది.