'పెద్ది' విషయంలో నాన్నకు బుచ్చిబాబు ప్రామిస్!
ఏ తండ్రైనా కొడుకు గొప్ప స్థానంలో ఉండాలని కోరుకుంటాడు. తాను సాధించలేనిది కుమారుడు సాధిస్తే అంతకు మించి ఆ తండ్రి కి కావాల్సింది ఏముంటుంది.
By: Tupaki Desk | 2 April 2025 1:00 AM ISTఏ తండ్రైనా కొడుకు గొప్ప స్థానంలో ఉండాలని కోరుకుంటాడు. తాను సాధించలేనిది కుమారుడు సాధిస్తే అంతకు మించి ఆ తండ్రి కి కావాల్సింది ఏముంటుంది. కుమారుడి సక్సెస్ ని చూసి శేష జీవితం గడి పేస్తాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగినా కొడుకు విషయంలో ఏ తండ్రి అంతే గర్వంగా ఫీల వుతాడు. ఈ విషయంలో ఎక్కువగా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు హైలైట్ అవుతుంటారు.
కొడుకులు స్టార్ డైరెక్టర్లగా...హీరోలగా ఎదిగితే ఆ తండ్రి ఆనందాన్ని అవదులుండవ్. తాజాగా ఇలాంటి ఓ ఎక్స్ పీరియన్స్ ని యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు షేర్ చేసుకున్నాడు. బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన `ఉప్పెన` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే బుచ్చిబాబు తండ్రి థియేటర్ వద్ద బయట నిలబడి షో అనంతరం సినిమా చూసొచ్చిన వాళ్లను సినిమా ఎలా ఉంది బాబు? అని అడిగే వారుట.
సినిమా చూసిన ఏ ఒక్కర్ని మిస్ చేయకుండా అడిగే వారుట. కానీ `పెద్ది` సినిమా విషయంలో తన తండ్రి అలా అడిగే పరిస్థితి ఉండదని బుచ్చిబాబు ధీమా వ్యక్తం చేసాడు. తన విజయంతోనే తండ్రికి ఘనమైన నివాళి అర్పిస్తాననన్నాడు. ఈ సినిమా సక్సెస్ చూడటానికి ఆయన తమ మధ్యలేరని కన్నీళ్లు చెమర్చారు. ఓ సామాన్యుడి సక్సెస్ అన్నది కుటుంబానికి...తనకి అంత కిక్ ని అందిస్తుంది.
వైజాగ్ కి చెందిన నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా టూర్ లో సెంచరీ కొట్టిన నేపథ్యంలో స్టేడియంలో ఎలాంటి ఎమోషన్ హైలైట్ అయిందో తెలిసిందే. కుమారుడి ట్యాలెంట్...కుటుంబీకుల ఎమోషన్ చూసి సునీల్ గవాస్కర్ సైతం కన్నీళ్లు చెమర్చారు. మట్టిలో మణిక్యాలు ఎలా ఉంటారు? అన్నది అర్దమైంది. ఇలాంటి ప్రతిభావంతులు ఎంతో మందికి సరైన అవకాశాలు రాక జీవితంలో వెనుకబడపోతున్నారు? అన్న అంశాన్ని గుర్తు చేసారు.