Begin typing your search above and press return to search.

ఆ సీక్వెల్ ఊసే ఎత్తడం లేదేంటి..?

రెండేళ్లలో పార్ట్ 2 వస్తుందని చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతం బ్రహ్మాస్త్ర 2 ని పక్కన పెట్టినట్లు తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   7 March 2024 12:30 PM GMT
ఆ సీక్వెల్ ఊసే ఎత్తడం లేదేంటి..?
X

రణ్ బీర్ కపూర్, అలియా భట్ జంటగా ఫాంటసీ యాక్షన్ మూవీగా వచ్చిన సినిమా బ్రహ్మాస్త్ర. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ శివ అంటూ 2022 సెప్టెంబర్ లో రిలీజైంది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను కరణ్ జోహార్, అపూర్వ మెహతా, హిరూ యశ్ జోహార్, నమిత్ మల్హోత్రా, అండ్ ముఖర్జీ నిర్మించారు. పాన్ ఇండియా వైడ్ రిలీజైన ఈ సినిమా 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. సినిమా హిందీతో పాటుగా తెలుగులో కూడా మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత అలియా భట్ నటించిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్ ను మెప్పించింది.

ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా స్పెషల్ రోల్ లో నటించారు. నాగార్జున నటించడం వల్ల సినిమాకు తెలుగులో కూడా సూపర్ బజ్ ఏర్పడింది. బ్రహ్మాస్త్రం పార్ట్ 1 వచ్చి రెండేళ్లు అవుతుంది. సినిమా దర్శకుడు దీనికి సీక్వెల్ గా భారీ ప్లానింగ్ తోనే ఉన్నాడు. బ్రహ్మాస్త్ర 2 ఉంటుందని పార్ట్ 1 రిలీజ్ టైం లోనే చెప్పాడు. రెండేళ్లలో పార్ట్ 2 వస్తుందని చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతం బ్రహ్మాస్త్ర 2 ని పక్కన పెట్టినట్లు తెలుస్తుంది.

ఓ పక్క రణ్ బీర్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో పాటుగా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ కూడా వార్ 2 ని తెరకెక్కిస్తున్నాడు కాబట్టి వారి వారి కమిట్మెంట్స్ పూర్తి చేసుకున్నాక బ్రహ్మాస్త్ర 2 ఉంటుందని తెలుస్తుంది. బ్రహ్మాస్త్ర 2 ని మరింత భారీగా ప్లాన్ చేస్తున్నాడట అయాన్ ముఖర్జీ. ఈమధ్య హనుమాన్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో గ్రాఫిక్స్ గురించి అందరు ప్రత్యేకంగా చెప్పుకున్నారు.

బ్రహ్మాస్త్ర 2 సినిమాకు కూడా అదే రేంజ్ లో గ్రాఫిక్స్ ఉంటాయని తెలుస్తుంది. బ్రహ్మాస్త్ర 2 మరింత భారీగా ఉండబోతుందని అంటున్నారు. రణ్ బీర్ కపూర్ యానిమల్ హిట్ తో సూపర్ జోష్ లో ఉన్నాడు. యానిమల్ తర్వాత యానిమల్ పార్క్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. బ్రహ్మాస్త్ర 2 కి రణ్ బీర్ కపూర్ డేట్స్ ఇవ్వాల్సి ఉంది. చూస్తుంటే అది 2025 లోనే కుదిరేలా ఉంది. ఈలోగా డైరెక్టర్ అయాన్ కూడా వార్ 2 షూటింగ్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడు.