Begin typing your search above and press return to search.

బోయపాటి.. ఇక అసలు ఆయుధం వాడాల్సిందే..

అందుకని అంతకంటే ముందుగా బాలయ్యతో అఖండ2 సినిమాని ఫినిష్ చేయాలని బోయపాటి డిసైడ్ అయ్యారంట.

By:  Tupaki Desk   |   13 Oct 2023 4:00 AM GMT
బోయపాటి.. ఇక అసలు ఆయుధం వాడాల్సిందే..
X

మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి తాజాగా స్కంద మూవీతో మరో డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఒక్క బాలయ్య తర్వాత మిగిలిన హీరోలకి బోయపాటి కథలు సెట్ అవ్వవని స్కంద మరోసారి ప్రూవ్ చేసింది. బాలకృష్ణ కాకుండా బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాలలో ఒక్క అల్లు అర్జున్ సరైనోడు మాత్రం హిట్ అయ్యింది.

దమ్ము, వినయ విదేయ రామా, జయ జానకి నాయకా, ఇప్పుడు స్కంద మూవీస్ బోయపాటి ఖాతాలో డిజాస్టర్ చిత్రాలుగా చేరాయి. అయిన కూడా తనకి అలవాటైన జోనర్ ని మాత్రం బోయపాటి ఇప్పట్లో వదిలేలా లేరు. అందుకే ఇప్పుడు బాలయ్యతో అఖండ 2 మూవీని స్టార్ట్ చేసేందుకు సిద్ధంఅ వుతున్నారు. బాలయ్య ఓ వైపు బాబీ దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు.

అది చేస్తూనే బోయపాటి అఖండ 2కి కూడా డేట్స్ ఇచ్చే అవకాశం ఉందంట. సూర్య హీరోగా బోయపాటి ఒక మూవీ ప్లాన్ చేశారు. ఇప్పటికే స్టొరీ నేరేషన్ కూడా అయిపోయిందంట. అయితే ప్రస్తుతం సూర్య శివ దర్శకత్వంలో కంగువ మూవీ చేస్తున్నారు. దీంతో పాటుగా సుధా కొంగారా దర్శకత్వంలో ఒక చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నారు.

ఈ రెండు కంప్లీట్ అయ్యేసరికి ఏడాది సమయం కచ్చితంగా పడుతుంది. అందుకని అంతకంటే ముందుగా బాలయ్యతో అఖండ2 సినిమాని ఫినిష్ చేయాలని బోయపాటి డిసైడ్ అయ్యారంట. నిజానికి స్కంద సూపర్ హిట్ అయ్యుంటే దానికి సీక్వెల్ ని పట్టాలు ఎక్కించేవారు. అయితే ఇది అంతగా వర్కౌట్ కాకపోవడంతో బోయపాటి దృష్టి తనకు బాక్సాఫీస్ ఆయుధంమైన బాలయ్య అఖండ సీక్వెల్ పై పడింది.

మరి బోయపాటి ప్లాన్ వర్క్ అవుట్ అవ్వాలంటే బాలయ్య డేట్స్ అడ్జస్ట్ చేయాలి. ఏపీలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మంచి వేడి మీద ఉన్నాయి. ఇలాంటి సమయంలో బాలయ్య ఎంత వరకు బోయపాటి సినిమా కోసం టైం కేటాయిస్తారు అనేది వేచి చూడాలి. ఒక వేళ డేట్స్ ఇచ్చిన ఏప్రిల్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మళ్ళీ షూటింగ్ కి గ్యాప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.