బాలీవుడ్ టాప్ 10 ఇంట్రెస్ట్ సినిమాలివే
ఫేమస్ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో ఆడియన్స్ నుంచి ఒపీనియన్స్ ను తీసుకుని ఏ సినిమాపై ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉన్నారనే విషయాన్ని వెల్లడిస్తూ ఉంటుంది
By: Tupaki Desk | 13 Jun 2025 12:34 PM ISTఫేమస్ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో ఆడియన్స్ నుంచి ఒపీనియన్స్ ను తీసుకుని ఏ సినిమాపై ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉన్నారనే విషయాన్ని వెల్లడిస్తూ ఉంటుంది. ఈ యాప్ ద్వారా ఆడియన్స్ ఏ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు? ఏ సినిమా చూడాలనుకుంటున్నారనే విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. బుక్ మై షో లో హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న టాప్ 10 బాలీవుడ్ మూవీస్ లిస్ట్ లో ఏయే సినిమాలున్నాయో చూద్దాం.
ఈ లిస్ట్ లో వార్2 సినిమా నెం.1 పొజిషన్ లో ఉంది. బ్లాక్ బస్టర్ వార్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో పాటూ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా నటిస్తుండటంతో వార్2పై అందరికీ మంచి అంచనాలున్నాయి. దానికి తోడు ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపిస్తున్నాడని తెలిసి ఈ మూవీపై ఆసక్తి ఇంకా పెరిగింది. ఈ సినిమాకు బుక్ మై షో లో ఇప్పటివరకు 142.8 వేల ఇంట్రెస్ట్‌లు నమోదయ్యాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన వార్2 ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
వార్2 తర్వాత అనీత్ పద్దా, అహాన్ పాండే నటిస్తున్న సాయియారా సినిమా 43.9 వేల ఇంట్రెస్ట్‌లతో రెండో స్థానంలో ఉంది. మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 18న రిలీజ్ కానుంది. మూడో స్థానంలో అక్షయ్ కుమార్ నటిస్తున్న వెల్ కమ్ బ్యాక్ టు ది జంగిల్ 41.3 వేల ఇంట్రెస్ట్‌లతో నిలిచింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఆ తర్వాత సితారే జమీన్ పర్ 37.8 వేల ఇంట్రెస్ట్‌లు, భాఘీ4 సినిమాకు 17.2 వేల ఇంట్రెస్ట్‌లు, పరమసుందరి మూవీకి 15.4 వేల ఇంట్రెస్ట్‌లు, మా మూవీకి 14.2 వేల ఇంట్రెస్ట్‌లు, ధడక్2 కు 12.4 వేల ఇంట్రెస్ట్‌లు, తేరే ఇష్క్ మే సినిమాకి 12.6 వేల ఇంట్రెస్ట్‌లు, మెట్రో ఇన్ డినోకు 9.7 వేల ఇంట్రెస్ట్‌లు నమోదయ్యాయి. అయితే రిలీజ్ డేట్స్ దగ్గర పడే కొద్దీ సినిమాలకు ఈ ఇంట్రెస్ట్‌లు ఇంకాస్త పెరుగుతూ ఉంటాయి. బుక్ మై షో లో ఇంట్రెస్ట్‌ల ఆధారంగానే సినిమాల ఓపెనింగ్స్ ఆధారపడి ఉంటాయని అందరూ భావిస్తూ ఉంటారు. మరి ఆడియన్స్ ఇంతలా ఎదురుచూస్తున్న ఈ సినిమాలు ఎలాంటి ఫలితాన్నిస్తాయో చూడాలి.
