Begin typing your search above and press return to search.

ర‌ణ‌బీర్-ఆలియాతో ఎన్టీఆర్-ప్ర‌ణ‌తి నైట్ పార్టీ

ఇది అరుదైన దృశ్యం. అభిమానుల‌కు క‌న్నుల పండుగ లాంటి దృశ్యం. టాలీవుడ్ పాపుల‌ర్ క‌పుల్ ఎన్టీఆర్-ప్ర‌ణ‌తి

By:  Tupaki Desk   |   29 April 2024 4:24 AM GMT
ర‌ణ‌బీర్-ఆలియాతో ఎన్టీఆర్-ప్ర‌ణ‌తి నైట్ పార్టీ
X

ఇది అరుదైన దృశ్యం. అభిమానుల‌కు క‌న్నుల పండుగ లాంటి దృశ్యం. టాలీవుడ్ పాపుల‌ర్ క‌పుల్ ఎన్టీఆర్-ప్ర‌ణ‌తి.. బాలీవుడ్ పాపుల‌ర్ క‌పుల్ ర‌ణ‌బీర్-ఆలియాతో క‌లిసి పార్టీలో క‌నిపించారు. అంతేకాదు ఎన్టీఆర్- రణబీర్ కపూర్ ఈ సంద‌ర్భంలో త‌మ భార్యామ‌ణుల‌కు బాడీ గార్డులుగా మారి జ‌నం తోపులాట‌ల్లో ఇర్రిటేట్ అవ్వ‌కుండా కాపాడారు. ఈ దృశ్యాలు ఇప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవ్వ‌డంతో అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. `ప్రొటెక్టివ్ హ‌జ్బెండ్స్` అంటూ వారిపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

నిన్న సాయంత్రం ముంబైలోని ఒక ఖరీదైన రెస్టారెంట్‌లో డిన్నర్ డేట్‌లో దృశ్య‌మిది. ఇరు ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన ఇద్ద‌రు సూప‌ర్‌స్టార్లు ఓచోట త‌మ భార్యామ‌ణుల‌తో క‌లిసి విందుకు రావ‌డం అరుదైన దృశ్యంగా అభిమానులు భావిస్తున్నారు. అభిమానులు, మీడియా నుండి రక్షించడానికి కవచాలుగా మారిన ఎన్టీఆర్‌, ర‌ణబీర్ ఫోటోలు వీడియోల‌ను అభిమానులు విరివిగా షేర్ చేస్తున్నారు.

డిన్న‌ర్ డేట్ ఎక్క‌డ‌? అంటే.. ముంబై బాంద్రాలోని ఓ పాపుల‌ర్ రెస్టారెంట్ దీనికి వేదిక అయ్యింది. దీనివ‌ల్ల బ‌య‌ట క్రౌడ్ ని మ్యానేజ్ చేయ‌డం క‌ష్టంగా మారింద‌ని చూస్తున్న దృశ్యాలు చెబుతున్నాయి. తార‌క్, ర‌ణ‌బీర్ త‌మ స‌తీమ‌ణుల‌తో వారి కార్ల వ‌ద్ద‌కు చేరుకునే క్ర‌మంలో జ‌నంలో తోపుల్లాట‌లు క‌నిపించాయి. ఎన్టీఆర్ తన భార్య చుట్టూ తన చేతులను చుట్టి సెల్ఫీల కోసం రెస్టారెంట్ వెలుపల గుమిగూడిన అభిమానుల నుండి ఆమెను రక్షించాడు. ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి తమ వెయిటింగ్ కారు వద్దకు నడుస్తున్న క్ర‌మంలో అభిమానితో సెల్ఫీ కోసం తార‌క్ ఆగారు. ఆస‌క్తిక‌రంగా ఈ డిన్న‌ర్ లో బాలీవుడ్ కి చెందిన దిగ్గ‌జాలు ఉన్నారు. `వార్ 2` షెడ్యూల్ లో పాల్గొనేందుకు ముంబైలో ఉన్న ఎన్టీఆర్.. సహనటుడు హృతిక్ రోషన్- సాబా ఆజాద్, దర్శకుడు అయాన్ ముఖర్జీ, క‌ర‌ణ్ జోహార్, ర‌ణ‌బీర్- అలియా భట్ ల‌తో కలిసి డిన్నర్ చేస్తూ కనిపించారు. ఈ పార్టీలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కూడా చేరడం ఫ్యాన్స్ ని ఎగ్జ‌యిట్ చేస్తోంది.

తాజా వీడియోలో ఎన్టీఆర్ అత‌డి భార్య కారును చేరుకోవడానికి వెళుతుండ‌గా కెమెరామెన్ గుంపు వారిని వెంబ‌డించ‌డం క‌నిపించింది. ఇంత‌లోనే ఎన్టీఆర్ అభిమానితో సెల్ఫీ కోసం స‌హ‌క‌రించారు. ఇక అదే వేదిక వ‌ద్ద అలియా- రణబీర్ జంట త‌మ‌ కారు వద్దకు వెళ్లి తిరుగు ప్ర‌యాణం అవుతున్న వీడియోలు ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. ర‌ణ‌బీర్ ప్ర‌స్తుతం రామాయ‌ణం చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. నితీష్ తివారీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.