Begin typing your search above and press return to search.

స్టార్ హీరోల‌ వార‌సులిద్ద‌రు క‌లుస్తున్నారా?

తాజాగా `ఏక్ దిన్` అనే మ‌రో చిత్రంలోనూ న‌టించాడు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. మిగతా ప‌నులు పూర్తి చేసుకుని త్వ‌ర‌లోనే సినిమా ప్రేక్ష‌కుల‌ముదుకు రానుంది.

By:  Tupaki Desk   |   3 March 2026 12:00 AM IST
స్టార్ హీరోల‌ వార‌సులిద్ద‌రు క‌లుస్తున్నారా?
X

బాలీవుడ్ లో ఇద్ద‌రు వార‌సుల కాంబినేష‌న్ కు అవ‌కాశం ఉందా? క‌లిస్తే ఆ కాంబినేష‌న్ సంచ‌ల‌న‌మే అవుతందా? అంటే అవున‌నే అనాలి. ఇంత‌కీ ఎవ‌రా వార‌సులు. ఏంటి వారి ప్ర‌త్యేక‌త అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. మిస్ట‌ర్ ప‌ర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ న‌ట వార‌సత్వాన్ని కొన‌సాగించ‌డానికి జునైద్ ఖాన్ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా కెరీర్ ప్రారంభించి హీరోగా స్థిర‌ప‌డే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. `మ‌హారాజ్` అనే చిత్రంతో హీరోగానూ ఎంట్రీ ఇచ్చాడు. అటుపై `ల‌వ్ యాప్` అనే మ‌రో చిత్రంలోనూ న‌టించాడు.

తాజాగా `ఏక్ దిన్` అనే మ‌రో చిత్రంలోనూ న‌టించాడు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. మిగతా ప‌నులు పూర్తి చేసుకుని త్వ‌ర‌లోనే సినిమా ప్రేక్ష‌కుల‌ముదుకు రానుంది. అయితే ఇంత వ‌ర‌కూ జునైద్ ఖాన్ తెర‌పై త‌న‌దైన ముద్ర వేయ‌లేదు. ఇంకా న‌ట‌నలో ఓన‌మాలు నేర్చుకుంటూనే ఉన్నాడు. వెనుక డాడ్ ఉన్నా? ఇంకా న‌ట‌న‌లో రాటు దేల‌లేదు. డాడ్ సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తున్నా? వాటిని ఇంకా పూర్తి స్తాయిలో ఆచ‌ర‌ణ‌లోకి తీసుకురాలేదు. అలాగే షారుక్ ఖాన్ వార‌సుడు ఆర్య‌న్ ఖాన్ న‌టుడిగా కాకుండా డైరెక్ట‌ర్ గా లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే.

`బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్` అనే తొలి చిత్రంతోనే విమర్శ‌కుల ప్ర‌శంస‌లందుకున్నాడు. ఆర్య‌న్ ఖాన్ క్రియేటివ్ రంగంలో ప‌నికొస్తాడా? లేదా? అని రిలీజ్ కు ముందు చాలా మందిలో చాలా సందేహాలుండేవి. కానీ వాట‌న్నింటిన ఆర్య‌న్ ఖాన్ తొలి సినిమాతోనే ప‌టా పంచ‌ల్ చేసాడు. ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే తాజాగా జునైద్ ఖాన్ హీరోగా ఆర్య‌న్ ఖాన్ ఓ డాక్యుమెంట‌రీ తెర‌కెక్కించే ప్లాన్ లో ఉన్న‌ట్లు బాలీవుడ్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఓ డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో డాక్యుమెంట‌రీ తీసి రిలీజ్ చేయాల‌నుకుంటున్నారుట‌. ఇప్ప‌టికే కాన్సెప్ట్ గురించి జునైద్ కి వినిపించాడుట‌.

అత‌డితో పాటు అమీర్ కూడా విని బాగుంద‌ని ముందుకెళ్లండ‌ని ప్రోత్స‌హించారుట‌. నిజంగా ఈ డాక్యుమెంట‌రీని స‌క్సెస్ చేయ‌గ‌ల్గితే గ‌నుక ఓ సంచ‌ల‌నం అవుతారు. ఎందుకంటే అమీర్ ఖాన్..షారుక్ ఖాన్ క‌లిసి న‌టించింది చాలా త‌క్కువ‌. ఇద్ద‌రు పెద్ద స్టార్లు అయినా? ఆ ఛాన్స్ మాత్రం తీసుకోలేదు. ఈ నేప‌థ్యంలో వారి త‌న‌యులైనా క‌లిసి ప‌నిచేస్తే చూడాలని ఇద్ద‌రి హీరోల అభిమానుల కోరుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఆర్య‌న్ ఖాన్ ఈ డాక్యుమెంట‌రీ ప‌నుల్లోనే బిజీగా ఉన్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. మ‌రి ఇందులో నిజ‌మెంతో? అధికారికంగా వెల్ల‌డిస్తే గానీ క్లారిటీ రాదు.