Begin typing your search above and press return to search.

బెదురులంకలో.. హీటెక్కించే సీన్స్!

కార్తీకేయ, నేహాశెట్టిల మధ్య రొమాంటిక్ సీన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్ ద్వారా ఈ విషయం అందరికీ అర్థమైంది.

By:  Tupaki Desk   |   24 Aug 2023 12:52 PM GMT
బెదురులంకలో.. హీటెక్కించే సీన్స్!
X

ఆర్ఎక్స్100 హీరోకార్తికేయ నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న సినిమా బెదురులంక 2012. ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. కాగా,ఈ సినిమాతో కచ్చితంగా విజయం సాధిస్తుందని కార్తికేయ చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు. శివ అనే పాత్రలో నటిస్తున్నాడు. క్లాక్స్ దర్శకత్వం వహించారు. కాగా, తన చుట్టూ జరుగుతున్న మోసాలను అరికట్టే పాత్రలో ఆయనలో ఈ సినిమాలో కనిపిస్తున్నాడు.

కాగా, ఈ మూవీ గురించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. దాని ప్రకారం, ఈ మూవీలో హీరో, హీరోయిన్లు కార్తీకేయ, నేహాశెట్టిల మధ్య రొమాంటిక్ సీన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్ ద్వారా ఈ విషయం అందరికీ అర్థమైంది. అయితే, లిప్ లాక్ సీన్లు కూడా ఉన్నాయని తాజా టాక్. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు మూవీకి హైలెట్ గా ఉంటాయని, యూత్ బాగా కనెక్ట్ అవుతారనే ప్రచారం జరుగుతోంది.

ఇక, ఈ సినిమా మొత్తం బెదురులంక అనే గ్రామం చుట్టూ జరిగే కథ. కేవలం మూడువారాల్లో ఏం జరిగిందో సినిమాగా చూపిస్తారు. 2012 యుగాంతం వస్తుందని ప్రజలు చాలా ఎక్కువగా నమ్మారు. ఆ సమయంలో ఈ గ్రామంలో ఏం జరిగింది? ప్రజల భయాన్ని ముగ్గురు వ్యక్తులు దేవుడి పేరు చెప్పి ఎలా మోసం చేశారు? వారి మోసాలను హీరో ఎలా అరికట్టాడు అనేదే కథ. మరి దానిని ఎలా ఆసక్తికరంగా చూపించారనేది తెలియాలంటే, సినిమా చూడాల్సిందే.

సినిమాలో కామెడీ అంతా చాలా ఆర్గానిక్ గా ఉంటుందని, కావాలని చొప్పించనట్లుగా ఉండదని కార్తీకేయ తెలిపారు. మణిశర్మ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని మూవీ టీమ్ భావిస్తోంది. ఇదిలా ఉండగా, హీరోయిన్ నేహా శెట్టి ప్రస్తుం మంచి జోరు మీద ఉంది. ఆమె చేతిలో ఈ బెదురు లంక కాకుండా, కిరణ్ అబ్బవరంతో రూల్స్ రంజన్, విశ్వక్ సేన్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నటిస్తోంది.

ఈ రెండు సినిమాల్లోనూ పాటలు, డ్యాన్సులు చాలా రొమాంటిక్ గా సాగుతున్నాయని, ఇప్పటికే విడుదలైన వీడియోల ద్వారా అర్థమైంది. మరి వీటిలో ఏ సినిమాలు క్లిక్ అవుతాయో చూడాలి.