Begin typing your search above and press return to search.

సైలెంట్ గా వచ్చేసిన బెదురులంక

ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌ లో సైలెంట్ గా బెదురులంక 2012 సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు. థియేట్రికల్‌ స్క్రీనింగ్ మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీ లో చూడవచ్చు

By:  Tupaki Desk   |   22 Sep 2023 6:46 AM GMT
సైలెంట్ గా వచ్చేసిన బెదురులంక
X

యువ హీరో కార్తికేయ నటించిన తాజా చిత్రం 'బెదురులంక 2012' పాజిటివ్ టాక్‌ దక్కించుకుంది. గత నెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కించుకోలేక పోయింది. థియేట్రికల్ రిలీజ్ లో మెప్పించిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ మొదలయ్యింది.

ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌ లో సైలెంట్ గా బెదురులంక 2012 సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు. థియేట్రికల్‌ స్క్రీనింగ్ మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీ లో చూడవచ్చు. ఓటీటీ లో స్ట్రీమింగ్ గురించి ఎలాంటి ప్రకటన లేకుండా వచ్చినప్పటికి వెంటనే పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఈ సినిమా ను చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

కార్తికేయ కి జోడీగా ఈ సినిమా లో డీజే టిల్లు ఫేం నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. విభిన్నమైన కాన్సెప్ట్‌ తో ఒక మంచి కామెడీ ఎంటర్‌ టైనర్ గా ఈ సినిమా రూపొందింది. క్లాక్స్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. లౌక్య ఎంటర్‌ టైన్మెంట్స్‌ బ్యానర్‌ లో ఈ సినిమాను రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించాడు.

మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలోని ఒకటి రెండు పాటలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ చిత్రంలో అజయ్‌ ఘోష్‌, శ్రీకాంత్ అయ్యంగర్, ఆటో రామ్ ప్రసాద్‌, వెన్నెల కిషోర్‌, ఎల్బీ శ్రీరామ్ లు కీలక పాత్రలో నటించారు. థియేట్రికల్‌ స్క్రీనింగ్ లో యావరేజ్‌ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ లో ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి.