Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ సినిమా ఫలితాన్ని బట్టి 'బ్రహ్మస్త్ర - 2'

అతి త్వరలోనే సినిమా షూటింగ్ ను ప్రారంభించి వచ్చే ఏడాది లోనే సినిమా షూటింగ్ ను ముగించాలని అయాన్ ముఖర్జీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   25 Oct 2023 5:53 AM GMT
ఎన్టీఆర్ సినిమా ఫలితాన్ని బట్టి బ్రహ్మస్త్ర - 2
X

హిందీ ప్రేక్షకులతో పాటు మొత్తం దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా 'బ్రహ్మాస్త్ర'. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా లో రణబీర్ కపూర్‌, ఆలియా భట్ జంటగా నటించగా అమితాబచ్చన్‌, నాగార్జున, షారుఖ్‌ ఖాన్‌ ఇంకా ఎంతో మంది స్టార్స్ కీలక పాత్రల్లో, గెస్ట్‌ రోల్స్ లో కనిపించిన విషయం తెల్సిందే.

సినిమా ప్రారంభం సమయం లోనే బ్రహ్మాస్త్ర సినిమా ను రెండు మూడు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే మొదటి పార్ట్‌ వచ్చి చాలా కాలం అయినా కూడా ఇప్పటి వరకు పార్ట్‌ 2 కు సంబంధించిన హడావుడి లేకపోవడంతో అసలు రెండో భాగం విషయంలో మేకర్స్ ఆసక్తిగా ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

ఎట్టకేలకు అయాన్ ముఖర్జీ తనకు రెండో భాగం కు సంబంధించిన స్క్రిప్ట్‌ ను వినిపించాడు అంటూ హీరో రణబీర్ కపూర్ పేర్కొన్నాడు. అయితే ప్రస్తుతం అయాన్ ముఖర్జీ 'వార్‌ 2' సినిమా తో బిజీగా ఉన్నాడు. హృతిక్‌ రోషన్‌ మరియు ఎన్టీఆర్‌ లు కీలక పాత్రల్లో నటిస్తున్న వార్‌ 2 సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయి షూటింగ్‌ కి ఏర్పాట్లు కూడా దాదాపు గా పూర్తి అయ్యాయి.

అతి త్వరలోనే సినిమా షూటింగ్ ను ప్రారంభించి వచ్చే ఏడాది లోనే సినిమా షూటింగ్ ను ముగించాలని అయాన్ ముఖర్జీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే ఇటీవల ఎన్టీఆర్‌ ను హైదరాబాద్‌ వచ్చి మరీ అయాన్ ముఖర్జీ కలవడం జరిగిందట.

ఎన్టీఆర్ తో అయాన్ ముఖర్జీ రూపొందించబోతున్న 'వార్‌ 2' సినిమా ఫలితం పై ఆధారపడి 'బ్రహ్మాస్త్ర 2' సినిమా ఉంటుంది అంటూ బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. వార్ 2 సినిమా కనుక ఫలితం అటు ఇటు అయితే కచ్చితంగా బ్రహ్మాస్త్ర 2 ని భారీ బడ్జెట్‌ తో నిర్మించేందుకు ముందుకు వచ్చేందుకు నిర్మాతలు సిద్ధం అవ్వకపోవచ్చు అంటూ కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ వార్ 2 ఫలితం ఏంటి అనేది 2025 లో క్లారిటీ వస్తుందేమో చూడాలి.