Begin typing your search above and press return to search.

తారక్ పై కావాలనే దుష్ప్రచారమా?

అయితే ఇంతలోనే ఒక రూమర్ తెరపైకి వచ్చింది. వార్2లో యాక్షన్ సన్నివేశాలు ఎన్టీఆర్ డూప్ తో చిత్రీకరిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   27 Oct 2023 4:03 AM GMT
తారక్ పై కావాలనే దుష్ప్రచారమా?
X

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ నటనపై హాలీవుడ్ దర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. కొంతమంది దర్శకులు అయితే భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తామని కూడా చెప్పారు. అంతలా తారక్ పాపులారిటీ పెరిగిపోయింది. ప్రస్తుతం అతను చేస్తోన్న సినిమాల లైన్ అప్ చూసుకుంటే తారక్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెంచే విధంగా ఉన్నాయి.

కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న దేవర మూవీ రెండు భాగాలుగా రాబోతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధమవుతోన్న ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ స్టొరీతో రెడీ అవుతోంది. కొరటాల శివ ఈ సినిమాపై చాలా కసిగా పని చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. హిందీలో యష్ రాజ్ ఫిలిమ్స్ లో వార్ 2 మూవీ కూడా తారక్ చేస్తున్నారు.

రీసెంట్ గా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. హృతిక్ రోషన్ కి సంబందించిన కీలక సన్నివేశాలు ప్రస్తుతం షూట్ చేస్తున్నారు. తారక్ డిసెంబర్ లో వార్ 2 మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇంతలోనే ఒక రూమర్ తెరపైకి వచ్చింది. వార్2లో యాక్షన్ సన్నివేశాలు ఎన్టీఆర్ డూప్ తో చిత్రీకరిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

ఎన్టీఆర్ పేస్ కనిపించని సీక్వెన్స్ అన్ని డూప్ పెట్టి పూర్తి చేస్తున్నారంటూ కథనాలు వైరల్ చేస్తున్నారు. ఇందులో వాస్తవం లేదని హృతిక్ రోషన్ సైతం క్లారిటీ ఇచ్చారు. అయితే కావాలనే తారక్ ఇమేజ్ ని తగ్గించే ఉద్దేశ్యంతో ఇలాంటి దుష్ప్రచారాలు తెరపైకి తీసుకొస్తున్నారని అభిమానులు అంటున్నారు.

తారక్ ఎదుగుదలని చూసి భరించలేక ఇలాంటి తప్పుడు ప్రచారాలకి తెరతీస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. తారక్ దేవర, వార్2 కంప్లీట్ చేసిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాని స్టార్ట్ చేయబోతున్నాడు. ఆ సినిమా రెండింటి కంటే మరింత అడ్వాన్స్ గా ఉంటుందని తెలుస్తోంది. కంటెంట్ డిమాండ్ బట్టి పాన్ వరల్డ్ లెవల్ లో ప్లాన్ చేసే అవకాశం ఉందంట.