Begin typing your search above and press return to search.

టైగ‌ర్ దుర‌దృష్టం ఎన్టీఆర్ అదృష్టం

నిజానికి బాలీవుడ్ మల్టీస్టారర్ ట్రైలర్ విడుదలైనప్పటి నుండి నెగెటివ్ టాక్‌ను సంపాదించుకుంది.

By:  Tupaki Desk   |   12 April 2024 5:36 AM GMT
టైగ‌ర్ దుర‌దృష్టం ఎన్టీఆర్ అదృష్టం
X

గ‌డిచిన ఐదేళ్ల‌లో స‌రైన బ్లాక్ బ‌స్ట‌ర్ లేక విల‌విల‌లాడుతున్నాడు టైగ‌ర్ ష్రాఫ్. హృతిక్ తో క‌లిసి వార్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రంలో న‌టించిన టైగ‌ర్ ష్రాఫ్, ఆ త‌ర్వాత వ‌రుస ప‌రాజ‌యాల‌ను ఎదుర్కొంటున్నాడు. భాఘి, వార్ లాంటి విజ‌యాలు మ‌ళ్లీ త‌న ఖాతాలో ప‌డ‌లేదు. అలాగే 2022-23 సీజ‌న్ లో కొన్ని భారీ చిత్రాల‌తో భారీ ఫ్లాపులు మూట‌గ‌ట్టుకున్న అక్ష‌య్ కుమార్ ఈ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు చాలా త‌వ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాడు. కానీ అది సాధ్య‌ప‌డ‌డం లేదు. ఇప్పుడు ఇద్ద‌రు ఫ్లాప్ హీరోలు క‌లిసి న‌టించిన బ‌డే మియాన్ చోటే మియాన్ ఇటీవ‌లే విడుద‌లైంది. రిజ‌ల్ట్ ఎలా ఉంది? అంటే.. జ‌నం పెద‌వి విరిచేస్తున్నారు.

నిజానికి బాలీవుడ్ మల్టీస్టారర్ ట్రైలర్ విడుదలైనప్పటి నుండి నెగెటివ్ టాక్‌ను సంపాదించుకుంది. ఈ ఈద్ కి స‌ల్మాన్ భాయ్ లేక‌పోవ‌డం వీళ్ల‌కు క‌లిసొస్తుంద‌ని అనుకున్నా కానీ, ఫేట్ చాలా ముందే డిసైడ్ అయిపోయింది. ఈద్ పండ‌గ ఈ భారీ చిత్రానికి అస్స‌లు క‌లిసి రాలేదు. మ‌రోసారి టైగ‌ర్, అక్ష‌య్ ఫ్లాప్ టాక్ ని ఎదుర్కొంటున్నారు.

ఈ సినిమా ఉగ్ర‌వాదం నేప‌థ్యంలో ఇప్ప‌టికే ప‌రిచ‌యం ఉన్న‌ లైన్ తోనే తెర‌కెక్కింది. కానీ పేల‌వ‌మైన స్క్రీన్ ప్లే నీరు గార్చార‌నేది విశ్లేష‌కుల మాట‌. దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ అల‌వాటైపోయిన పాత క‌థ‌నే రిపీట్ చేసాడు. స‌ర‌ళ‌మైన క‌థ‌ను ఎంచుకున్నా, ఔట్ డేటెడ్ స్క్రీన్ ప్లేతో రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా తీశాడ‌న్న విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంటున్నాడు. యాక్ష‌న్ డ్రామాను అత‌డు బోరింగ్ గా చూపించాడ‌నేది అప‌వాదు. భారీ పోరాట స‌న్నివేశాలు అన్నిసార్లు ఆదుకోలేవు. వార్ లో వ‌ర్క‌వుటైన‌ట్టు ఈ సినిమాలో యాక్ష‌న్ దృశ్యాలు వ‌ర్క‌వుట్ కాలేదు. ముఖ్యంగా భావోద్వేగాలు లేకుండా ఈ సినిమాని తెర‌కెక్కించ‌డంతో అది కాస్తా మిస్ ఫైర్ అయింది.

క‌థాంశం ఇదీ:

మిల‌ట‌రీ అధికారులు ఫొల్క్స్ ఫిరోజ్ (అక్షయ్)- రాకేష్ (టైగర్) ఎలాంటి కఠినమైన మిషన్‌ను అయినా సులభంగా సుసాధ్యం చేయ‌గ‌ల‌రు. కానీ ఊహించని పరిణామంలో ఉద్యోగాలు కోల్పోతారు. అంతర్జాతీయ ఉగ్రవాది కబీర్ (పృథ్వీరాజ్ సుకుమారన్) దేశంలోని కీలకమైన ఆయుధాన్ని దొంగిలించి లండన్‌కు పారిపోతాడు. దాన్ని తిరిగి తీసుకురావడానికి బడే మియాన్ - చోటే మియాన్‌లకు మిష‌న్‌ని అప్ప‌గించాక ఏం జ‌రిగింద‌న్న‌దే సినిమా. వీరిద్దరూ కెప్టెన్ మిషా (మానుషి చిల్లర్)తో కలిసి మిషన్‌ను ప్రారంభిస్తారు. అనంత‌రం క‌థ ఊహించ‌ని విధంగా టేకాఫ్ అవుతుంది.

టైగ‌ర్ ష్రాఫ్ ఇటీవ‌ల రాంగ్ ట్రాక్ లో ప‌డ్డాడు. అత‌డు వార్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్లో న‌టించాక వార్ సీక్వెల్లో అవ‌కాశం అందుకోక‌పోవ‌డం కూడా దుర‌దృష్టం. ఇప్పుడు వార్ 2లో అనూహ్యంగా తార‌క్ కి అవ‌కాశం ద‌క్కింది. ఇది యంగ్ టైగ‌ర్ కి అదృష్టంగా మారుతుంద‌ని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఒక ఉత్త‌రాది సూప‌ర్ స్టార్, ఒక ద‌క్షిణాది సూప‌ర్ స్టార్ ల క‌ల‌యిక ప్ర‌జ‌ల్లో ఉత్సాహం నింపింది. దానికి తగ్గ‌ట్టే వార్ 2ని మ‌రో లెవల్లో తెర‌కెక్కించేందుకు య‌ష్ రాజ్ సంస్థ ఎంతో ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తోంది. ఇది తార‌క్ కి క‌లిసొచ్చే ప‌రిణామం.