Begin typing your search above and press return to search.

NTR వార్ 2.. ఎక్కడి వరకు వచ్చిందంటే?

జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి మల్టీస్టారర్ మూవీ వార్ 2 చేయబోతున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   1 Sep 2023 6:15 AM GMT
NTR వార్ 2.. ఎక్కడి వరకు వచ్చిందంటే?
X

జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి మల్టీస్టారర్ మూవీ వార్ 2 చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాత ఆదిత్య చోప్రా.. యశ్ రాజ్ ఫిల్మిస్ స్పై యూనివర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని.. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ వార్ కు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్నారు.

అయితే యశ్ రాజ్ ఫిల్మ్స్ విషయానికొస్తే.. తమ ప్రాజెక్ట్ కు సంబంధించిన విషయాలన్నింటినీ ఎప్పుడూ సీక్రెట్ గా ఉంచుతుంది. షూటింగ్ షెడ్యూల్స్, కాస్ట్ ఇతర ఏ వివరాలకు సంబంధించి పెద్దగా అప్డేట్స్ చెప్పదు. ఏ సమాచారం లీక్ అవ్వకుండా ఎంతో జాగ్రత్తగా సినిమాను పూర్తి చేస్తుంది. కానీ ఇప్పుడు వార్ 2పై మాత్రం ఓ అదిరిపోయే వార్త బయటకు వచ్చింది.

అదేంటంటే.. వార్ 2ను బ్రహ్మాస్త్ర చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకున్న అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన రీసెంట్ గా హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ ఓ బుక్ స్టోర్ ను సందర్శించారట. అక్కడ ఓ అభిమానితో ముచ్చటించారని తెలిసింది. తన నెక్ట్స్ ప్రాజెక్ట్, వార్ 2 సినిమాల గురించి మాట్లాడారని సమాచారం అందింది. వార్ 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయని అయాన్ చెప్పారట.

అలాగే ఆయన దేవర షూటింగ్ తో బిజీగా ఉంటున్న ఎన్టీఆర్ తో కూడా రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారని అర్థమవుతోంది. స్క్రిప్ట్ డిస్కషన్స్ చేస్తున్నారట. ఓ సౌత్ సూపర్ స్టార్ తో ఇంటరాక్ట్ అవ్వడం అయాన్ కు ఇదే తొలిసారి కావడం విశేషం. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ ను స్టడీ చేస్తున్నారట. అతడి టాలెంట్, స్టార్ డమ్, బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టే స్క్రిప్ట్ లోని ఎన్టీఆర్ పాత్రను డిజైన్ చేస్తున్నారని తెలిసింది.

ఇక వార్ 2 విషయానికొస్తే.. మోస్ట్ హైప్డ్ ప్రాజెక్ట్స్ లో ఇది కూడా ఒకటి. 2025 జనవరిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఇది యశ్ రాజ్ ఫిల్మిస్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ యూనివర్స్ నుంచి వచ్చిన పఠాన్, టైగర్, వార్ సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు వార్ 2 తో పాటు పఠాన్ వర్సెస్ టైగర్ సినిమాలు రాబోతున్నాయి. టైగర్ 3 త్వరలోనే రిలీజ్ కానుంది.