అయాన్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు..?
బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తన నెక్స్ట్ సినిమా వార్ 2 తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
By: Tupaki Desk | 26 July 2025 11:00 PM ISTబాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తన నెక్స్ట్ సినిమా వార్ 2 తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్స్ లో ఒకడిగా అయాన్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. బ్రహ్మాస్త్ర హిట్ కాగానే వార్ సీక్వెల్ బాధ్యతను అతని మీద పెట్టారు యష్ రాజ్ ఫిలింస్ నిర్మాతలు. ఐతే అయాన్ ఈ సినిమాలో సౌత్ స్టార్ ని కూడా తీసుకుంటే బెటర్ అన్న ఆలోచనతో మన ఎన్టీఆర్ ని తీసుకున్నారు. హృతిక్ రోషన్, ఎన్ టీ ఆర్ ఇద్దరు ఆన్ స్క్రీన్ ఫైర్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని తెలుస్తుంది.
ఆగష్టు 14న రిలీజ్ అవబోతున్న వార్ 2 సినిమా ట్రైలర్ ఆల్రెడీ వచ్చేసింది. ఐతే ఈ ట్రైలర్ చూసిన ఆడియన్స్ సినిమాపై కాస్త డౌట్ పడుతున్నారు. ఎందుకంటే వార్ 2 ట్రైలర్ లో విజువల్స్, యాక్షన్ బ్లాక్స్ బాగున్నాయి. తెర మీద ఆ రిచ్ నెస్ కనిపిస్తుంది. కానీ ఏ బాలీవుడ్ యాక్షన్ సినిమా తీసుకున్నా కూడా ఇదే రేంజ్ లో యాక్షన్ అడ్వెంచర్స్ ఉంటాయి. అయాన్ తన మార్క్ కొత్తగా చూపించింది ఏమి లేదు. మహా ఐతే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల ఎలివేషన్ ని కాస్త మార్చి ఉండొచ్చు.
కానీ వార్ 2 ట్రైలర్ చూస్తే ఫక్తు బాలీవుడ్ యాక్షన్ సినిమా తరహా తప్ప ఎలాంటి ఎగ్జైట్మెంట కలిగించలేదు. అఫ్కోర్స్ ఎన్ టీ ఆర్ ఉండటం వల్ల మన తెలుగు ఆడియన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్ 2 కోసం ఆసక్తిగా ఉన్నారు. కానీ అయాన్ ముఖర్జీ సినిమాలో ఏం చూపిస్తాడన్నది తెలియాల్సి ఉంది. వార్ సినిమా కథలానే వార్ 2 కూడా ఉండబోతుందనే టాక్ వచ్చింది. బాలీవుడ్ లో ఆల్రెడీ సినిమాపై నెగిటివిటీ వచ్చేసింది. సినిమా ఏమాత్రం తేడా వచ్చినా అయాన్ ని ఒక రేంజ్ లో ట్రోల్ చేసే ఛాన్స్ ఉంది.
ఐతే అలాంటి అయాన్ ముఖర్జీ వార్ 2 తో హిట్ కొడితే మాత్రం నెక్స్ట్ మరో టాలీవుడ్ స్టార్ హీరోతోనే సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ఐతే టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ మరో ఛాన్స్ ఇవ్వాలంటే వార్ 2 అయాన్ బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే. వార్ 2 ట్రైలర్ చూస్తే ఓకే ఓకే అనిపించేసింది. మరి సినిమా అయినా సెన్సేషన్ అనిపిస్తుందా లేదా అన్నది చూడాలి.
