Begin typing your search above and press return to search.

హృతిక్-తార‌క్ మ‌ధ్య న‌లిగిపోయిన డైరెక్ట‌ర్!

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోష‌న్-టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్రాల్లో భారీ అంచ‌నాల మ‌ధ్య ఆయాన్ ముఖ‌ర్జీ 'వార్ 2' చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Jun 2025 10:00 PM IST
హృతిక్-తార‌క్ మ‌ధ్య న‌లిగిపోయిన డైరెక్ట‌ర్!
X

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోష‌న్-టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్రాల్లో భారీ అంచ‌నాల మ‌ధ్య ఆయాన్ ముఖ‌ర్జీ 'వార్ 2' చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. తార‌క్ బాలీవుడ్ ఎంట్రీ చిత్రం కావ‌డంతో ఎలాంటి పాత్ర‌లో క‌నిపిస్తాడా? అని స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో అంచ‌నాలు పీక్స్ కు చేరాయి.

ఈ నేప‌థ్యంలో తాజాగా ప్రాజెక్ట్ గురించి ఆయాన్ ముఖ‌ర్జీ తొలిసారి స్పందించారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌తో అంచ‌నాలు ఇంకా రెట్టింపు అవ్వ‌డం ఖాయం. 'వార్ చిత్రానికి ఎంతో మంది అభిమానులున్నారు. దీంతో 'వార్ 2' విష‌యంలో నాపై ఎంతో బాధ్య‌త ఉంది. ఈ సినిమా డైరెక్ట్ చేయ‌డం అన్న‌ది నాకు దొరికిన గొప్ప అవ‌కాశంగా భావిస్తున్నా. హృతిక్-ఎన్టీఆర్ ల‌తో సినిమా అంటే స్టోరీ విషయంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి వ‌చ్చింది.

హృతిక్ -ఎన్టీఆర్ మ‌ధ్య ఘ‌ర్ణ‌ణ వాతావ‌ర‌ణాన్ని సృష్టించ‌డానికి ఎంతో స‌మయం తీసుకున్నా. ఇద్ద‌రు స్టార్ క‌లిసి న‌టించిన సినిమా కాబ‌ట్టి ఇది నిజ‌మైన ఇండియ‌న్ సినిమా కానుంది. ఈ సినిమాపై అభిమానుల అంచ‌నాలు ఊహించ‌గ‌ల‌ను. థియేట‌ర్లో కూర్చున్న‌ప్పుడు వాళ్లంద‌రికీ జీవితాంత గుర్తుండిపోయే సినిమా ఇచ్చేందుకు ప్ర‌తీ క్ష‌ణం ప‌నిచేస్తూనే ఉన్నా' అన్నారు. సాధార‌ణంగా ఇద్ద‌రు స్టార్ హీరోల‌ను డైరెక్ట్ చేయ‌డం అన్న‌ది ఎంతో బాధ్య‌త, ఒత్తిడితో కూడుకున్న ప‌నే.

ఎన్నో విష‌యాలు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ప‌నిచేయాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో ర‌క‌ర‌కాల సందేహాలు వెంటాడుతుంటాయి. ఫ‌లితం ఏమాత్రం తేడాగా వ‌చ్చిన సోషల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌లు ఎదుర్కో వాల్సిందే. పైగా తారక్ బాలీవుడ్ ఎంట్రీ సినిమా కాబ‌ట్టి అభిమానులు ఏ రేంజ్ లో విధ్వంసం సృష్టిస్తారో చెప్పాల్సిన ప‌నిలేదు.