Begin typing your search above and press return to search.

విక్రమ్.. సూర్యకు ఆ సంగతే చెప్పలేదట

By:  Tupaki Desk   |   6 March 2016 5:30 PM GMT
విక్రమ్.. సూర్యకు ఆ సంగతే చెప్పలేదట
X
మొన్న సాయంత్రం ‘24’ టీజర్ రిలీజైనప్పటి నుంచి సౌత్ ఇండియాలో ఈ సినిమా గురించి పెద్ద ఎత్తునే చర్చ నడుస్తోంది. విక్రమ్ కుమార్ - సూర్య కలిసి ఓ వరల్డ్ క్లాస్ మూవీనే అందించబోతున్నారన్న సంగతి టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. విక్రమ్ విజన్.. సూర్య యాక్టివ్ పవర్.. టీజర్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సూర్య విభిన్నమైన అవతారాలతో ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించాడు. అందులోనూ నెగెటివ్ రోల్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. సూర్య లాంటి స్టార్ హీరో నెగెటివ్ రోల్ చేయడం.. అది కూడా తాను హీరోగా నటిస్తున్న సినిమాలోనే కావడం ఆసక్తి రేకెత్తించేదే.

ఐతే తాను ఈ కథ చెప్పేటపుడు సూర్యకు ఈ నెగెటివ్ రోల్ తనే చేయబోతున్న సంగతే వెల్లడించలేదంటున్నాడు దర్శకుడు విక్రమ్. ‘‘ముందు ఇందులో ఎవరు ఏ పాత్ర పోషిస్తారు అనేది వెల్లడించకుండా.. కథంతా చెప్పాను. నెగెటివ్ రోల్ గురించి చెబుతుంటే సూర్య చాలా ఆసక్తిగా విన్నాడు. కథంతా చెప్పాక ఈ నెగెటివ్ రోల్ కూడా మీరే చేస్తారు అని చెప్పడంతో ఆయన చాలా ఆశ్చర్యపోతూ ఒక ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు. ఇక ఆ పాత్ర కోసం ఆయన ఎంత హోం వర్కర్ చేశారు.. దాన్ని ఎంత అద్భుతంగా పండించారు అన్నది మాటల్లో చెప్పలేను. క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టే నటుడు సూర్య. నేను నెగెటివ్ రోల్ చేయడమేంటి అని ఒక్క మాట కూడా అనకుండా ఆ పాత్ర పోషించడానికి రెడీ అయిపోయాడు. ఇక ఇందులో ముసలివాడిగా కనిపించే పాత్ర కోసం సూర్య చాలా కష్టపడ్డాడు. ఆ పాత్రకు మేకప్ వేయడానికి ఐదు గంటలు పట్టేది. 10 గంటలకు షూటింగ్ అంటే.. తెల్లవారుజామున 5 గంటలకే సెట్ కు వచ్చి మేకప్ పని మొదలుపెట్టేవాడు. ఇంత డెడికేషన్ ఉన్న ఆర్టిస్టుని నేనింత వరకు చూడలేదు’’ అని విక్రమ్ తన హీరోపై ప్రశంసలు కురిపించాడు.