Begin typing your search above and press return to search.

హలో తర్వాత లైన్లో ఉన్నవి ఇవే

By:  Tupaki Desk   |   9 Jan 2018 6:10 PM IST
హలో తర్వాత లైన్లో ఉన్నవి ఇవే
X
హలో కమర్షియల్ సక్సెస్ కాకపోవడం దర్శకుడు విక్రం కె కుమార్ ని నిరుత్సాహ పరిచినా తన తరువాతి ప్రాజెక్ట్స్ కి సిద్ధం అవుతున్నాడు. హలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చైతుతో మరో సినిమా చేయమని నాగార్జున స్వయంగా స్టేజి మీదే రిక్వెస్ట్ చేయటంతో ఇప్పుడు ఆ పనుల్లో బిజీ అవుతున్నాడు విక్రం. హలో రేంజ్ ఏంటి అనేది పక్కన పెడితే సున్నితమైన అంశాలను ఎమోషనల్ గా డీల్ చేయడంలో తన టాలెంట్ మరోసారి బయట పెట్టుకున్నాడు.

అందుకే చైతుతో చేయబోయే సినిమా ఇంకా స్పెషల్ గా ఉండేలా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. ఈ ఇద్దరి కాంబోలో గతంలో వచ్చిన మనం కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోయింది. హలో తర్వాత కూడా విక్రం కె కుమార్ నెక్స్ట్ మూవీస్ మీద కూడా మంచి క్లారిటీ తో ఉన్నాడు.లై దెబ్బకు కాస్త డల్ అయిన నితిన్ తో ఒక ప్రాజెక్ట్ ప్లానింగ్ లో ఉన్నాడు. నితిన్ తో చేసిన ఇష్క్ వల్లే విక్రం ప్రతిభ ఏంటి అనేది టాలీవుడ్ కు పూర్తి స్థాయిలో పరిచయం అయ్యింది. ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మరోసారి ఆ మేజిక్ రిపీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు ఇద్దరు.

సూర్యతో 24కు వర్క్ చేసాక తననతో మరో సినిమా చేయాలన్న ఆకాంక్ష ఆయన అప్పుడే బయటికి చెప్పారని, సరైన కథతో మెప్పించడం కోసం ఎదురుచూస్తున్నట్టు చెబుతున్న విక్రం నిజంగా ఘటికుడే. ఒక్కసారి చేసిన హీరోలు మరో సినిమా చేసేదాకా తనను వదలడం లేదంటే అతని టేకింగ్ మీద ఎంత నమ్మకమో ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. ఇప్పటికీ హీరొయిన్ గా అవకాశాలు కొట్టేస్తున్న శ్రేయను ఇష్టం సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయం చేసింది విక్రం కె కుమారే.