Begin typing your search above and press return to search.
విజయశాంతి పిల్లలు వద్దనుకున్నారా?
By: Tupaki Desk | 5 Jan 2020 10:50 AM ISTలేడీ సూపర్ స్టార్ విజయశాంతి దాదాపు 13ఏళ్ల తర్వాత తిరిగి సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ధీటైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 11న రిలీజవుతున్న సందర్భంగా విజయశాంతి మీడియాతో ముచ్చటించారు. ఈ ముచ్చట్లలో తన వ్యక్తిగత జీవితం.. వైవాహిక జీవితం గురించి వెల్లడించారు.
విజయశాంతి నటనలో కొనసాగుతున్న సమయంలోనే శ్రీనివాస ప్రసాద్ ని వివాహమాడిన సంగతి తెలిసిందే. శ్రీనివాస్ తో పరిచయం ఏర్పడిన చాలా తక్కువ కాలంలోనే అభిప్రాయాలు కలవడం పెళ్లి జరిగిపోవడం కలలానే సాగింది. అందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఇక ఎలాంటి హంగామా లేకుండా కోట్లు ఖర్చు చేసే పెళ్లిళ్లు నాకు నచ్చవు. అందుకే సింపుల్ గా రిజిస్టార్ మ్యారేజ్ చేసుకున్నాం అని విజయశాంతి తెలిపారు.
పిల్లలు అంటే చాలా ఇష్టం. కానీ పిల్లలు పుడితే నా అనే స్వార్థం వచ్చేస్తుంది. అందుకే ఒక దశలో పిల్లలు వద్దనుకున్నా. రాజకీయాల్లో మన అన్నదే ఉండాలి. నిస్వార్థంగా సేవలు చేయాలి. నాకు ఇంతటి స్థాయి ఇచ్చిన ప్రజలకే అంకితమవ్వాలనుకున్నాను. అందుకనే పిల్లలు వద్దనుకున్నాం. నా అభిప్రాయానికి మావారు విలువిచ్చారు... అని వెల్లడించారు.