Begin typing your search above and press return to search.

స్కూల్ బ్యాగ్ నుండి యాక్షన్ చెప్పే వరకు

By:  Tupaki Desk   |   20 Nov 2016 5:30 PM GMT
స్కూల్ బ్యాగ్ నుండి యాక్షన్ చెప్పే వరకు
X
అంతే కదా.. అసలు ఫిలిం ఇండస్ర్టీకి రావడం అనేదే ఒక డ్రీమ్. ఎంతోమంది మెగాస్టార్ చిరంజీవి అభిమానులు సినిమాల్లోకి వచ్చాక.. ఆయనతో కలసి నటించడమో లేక ఆయన్ను డైరక్ట్ చేయడమో చేసినవారే. వారందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఆ కిక్కే వేరబ్బా అంటుంటారు. ఇప్పుడు అలాంటి కిక్కే హీరో సూర్య ఫ్యాన్ ఒకరికి వచ్చిందట. పదండి చూద్దాం.

''నేను చిన్నప్పుడు స్కూల్ బ్యాగ్ వేసుకునే రోజుల్లో సూర్య సార్ ''కాక కాక'' (తెలుగులో వెంకటేష్‌ రీమేక్ చేసిన ఘర్షణ) చూశాను.. ఇప్పుడు ఆయనకు యాక్షన్ అండ్ కట్ చెప్పే రేంజుకు వచ్చాను. తొలిరోజు ఆ అనుభూతి మరువలేనిది అంతే'' అంటున్నాడు దర్శకుడు విఘ్నేష్‌ శివన్. మన టాలీవుడ్ లో నయనతార కొత్త బాయ్‌ ఫ్రెండ్ గా పాపులర్ అయిన ఈ రెండు సినిమాల దర్శకులు.. ఇప్పుడు సూర్యతో సినిమాను చేస్తున్నాడు. 'తానా సేరనదా కూటమ్' అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమా తొలిరోజు షూటింగ్ పూర్తవ్వగానే ఇప్పుడు విఘ్నేష్‌ తన సంతోషాన్ని అలా పంచుకున్నాడు.

ఇక సూర్య ఫ్యాన్స్ ఇంకొకరి గురించి మనం చెప్పుకోవాలంటే.. కాక కాక సినిమాకు ధియేటర్లలో విజిల్స్ వేసిన ఒకమ్మాయి.. ఇప్పుడు సమంతగా సౌత్ ప్రేక్షకులను అలరిస్తూ.. సూర్యతో జతగా ఓ రెండు సినిమాల్లో నటించింది. అప్పుడు సమంత కూడా ఇదే విధంగా తన ఆనందాన్ని వ్యక్తపరిచిందిలే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/