Begin typing your search above and press return to search.

కథ తనదన్న శౌర్య.. అప్సెట్ అయిన డైరెక్టర్?

By:  Tupaki Desk   |   30 Dec 2019 6:42 PM IST
కథ తనదన్న శౌర్య.. అప్సెట్ అయిన డైరెక్టర్?
X
యవహీరో నాగశౌర్య త్వరలో 'అశ్వథ్థామ' తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా జనవరి 31 న రిలీజ్ కానుంది. హోమ్ బ్యానర్ అయిన ఐరా క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు నాగశౌర్య స్వయంగా కథ అందించడం విశేషం. ఈ సినిమాతో నూతన దర్శకుడు రమణతేజ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు.

'అశ్వథ్థామ' సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ కూడా ఫిక్స్ అయిందని మరో రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. ఈ సినిమా రిలీజ్ కు ముందు ఒక హీరో నాగశౌర్య ఒక కామెంట్ చేశాడు. అది ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ అయింది. రీసెంట్ గా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ 'ఛలో' సినిమాకు కథ అందించింది కూడా తనేనని శౌర్య చెప్పుకొచ్చాడు. 'ఛలో' సినిమా దర్శకుడు వెంకీ కుడుముల ఈ వ్యాఖ్యతో అప్సెట్ అయ్యాడని అంటున్నారు. నిజానికి 'ఛలో' కథను వెంకీ కుడుముల.. నాగశౌర్య కలిసి డెవలప్ చేశారట. కానీ ఇప్పడేమో కథ క్రెడిట్ పూర్తిగా శౌర్య తీసేసుకోవడం వెంకీ కుడుములకి నచ్చలేదని అంటున్నారు.

ఒక సినిమా రిలీజుకు ముందు ఇలా ఒక వివాదం తలెత్తడం ఎప్పుడూ సినిమాకు ప్రచారంలాగా ఉపయోగపడుతుంది. బాలీవుడ్ లో ప్రచారం కోసం సినిమా విడుదలకు ముందు కొన్ని వివాదాలను కావాలని సృష్టిస్తారు. శౌర్య కూడా ఇలా బాలీవుడ్ స్టైల్ లో ఒక వివాదాస్పద వ్యాఖ్య చెయ్యడం 'అశ్వథ్థామ' కు మంచి ప్రచారం అయ్యేలా ఉంది. మరి ఈ విషయంపై వెంకీ కుడుముల ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.