Begin typing your search above and press return to search.

సూర్య ఈసారి గ‌ట్టిగానే ప్లాన్ చేస్తున్నాడా?

By:  Tupaki Desk   |   3 Sep 2022 12:30 AM GMT
సూర్య ఈసారి గ‌ట్టిగానే ప్లాన్ చేస్తున్నాడా?
X
సూర్య విభిన్న‌మైన సినిమాల‌కు కెరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన విష‌యం తెలిసిందే. కొత్త త‌ర‌హా సినిమాలు చేస్తూనే క‌మ‌ర్షియల్ మాస్ మసాలా సినిమాల‌తో హీరోగా త‌న‌కంటూ తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఒక ద‌శ‌లో వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకున్న సూర్య `సింగం 3` త‌రువాత నుంచి వ‌రుస ఫ్లాపుల్ని సొంతం చేసుకున్నాడు. ఈ ద‌శ‌లో ఏ సినిమా చేసినా ఫ్లాపులే ప‌ల‌క‌రించ‌డంతో సూర్య ఇక క‌ష్ట‌మేనా అనే కామెంట్ లు వినిపించాయి.

అయితే అదే స‌మ‌యంలో అనూహ్యంగా `ఆకాశం నీ హ‌ద్దురా` మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకుని మ‌ళ్లీ  ట్రాక్ లోకి వ‌చ్చాడు. క‌రోనా త‌రువాత సెకండ్ వేవ్ టైమ్ లో ఓటీటీలో నేరుగా విడుద‌లైన ఈ మూవీ కోసం హీరో సూర్య ఓ యుద్ధ‌మే చేశాడ‌ని చెప్పాలి. థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌క‌పోవ‌డం.. ఓటీటీఓ రిలీజ్ చేయ‌డంతో ఎగ్జిబిట‌ర్లు సూర్య సినిమాల‌ని థియేట‌ర్లలో రిలీజ్ చేయ‌కుండా బ్యాన్ చేస్తామంటూ హెచ్చరించాయి. తానే నిర్మాత‌గా భారీ బ‌డ్జెట్ తో ఎన్నో వ్య‌వ‌ప్ర‌యాస‌ల కోర్చి నిర్మించిన సినిమా కావ‌డంతో సూర్య ఇలాంటి బెదిరింపుల‌కు త‌లొగ్గ‌లేదు.

ముందు అనుకున్న‌ట్టుగానే ఎవ‌రెన్ని రకాలుగా బెదిరించినా లెక్క‌చేయ‌కుండా `ఆకాశ‌మే నీ హ‌ద్దురా` మూవీని డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుద‌ల చేసి సంచ‌ల‌నం సృష్టించాడు. ఓటీటీలో విడుద‌లైన ఈ మూవీ సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన సూర్య న‌మ్మ‌కాన్ని నిజం చేసింది. ఈ మూవీ ఇచ్చిన స్ఫూర్తితో హీరో సూర్య త‌రువాత చేసిన `జై భీమ్` ని కూడా ఓటీటీలో విడుద‌ల చేయ‌డం అది కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకోవ‌డంతో సూర్య ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల‌య్యారు.

అయితే పాండిరాజ్ డైరెక్ష‌న్ లో చేసిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ఎంతార్కుమ్ తున్నిద‌వ‌న్‌` భారీ అంచ‌నాల‌తో విడుద‌లై డిజాస్ట‌ర్ అనిపించుకుని సూర్య‌కు వ‌రుస హిట్ ల త‌రువాత ఊహించ‌ని షాకిచ్చింది. ప్ర‌స్తుతం బాల తో `అచ‌లుడు` మూవీ చేస్తున్నాడు. ఈ మూవీపై సూర్య‌తో పాటు ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నా అంద‌రి దృష్టి మాత్రం వెట్రిమార‌న్ తో సూర్య చేయ‌బోతున్న `వాడివాస‌ల్‌`పైనే వుంది. కార‌ణం వెట్రిమార‌న్ చేసిన `అసుర‌న్‌` ఉత్త‌మ త‌మిళ చిత్రంగా 2019లో జాతీయ పుర‌స్కారాన్ని సొంతం చేసుకుంది.

ప్ర‌స్తుతం విజ‌య్ సేతుప‌తితో `విడుద‌లై` మూవీని చేస్తున్నాడు. చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ మూవీ పూర్తి కావ‌స్తున్న నేప‌థ్యంలో సూర్య‌తో చేయ‌నున్న `వాడివాస‌ల్‌`ని డిసెంబ‌ర్ నుంచి ప‌ట్టాలెక్కించ‌డానికి రెడీ అవుతున్నాడు. వీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఈ మూవీని క‌లైపులి ఎస్ థాను నిర్మించ‌బోతున్నారు.

జ‌ల్లిక‌ట్టు నేప‌థ్యంలో సాగే ఈ మూవీలో సూర్య ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నాడ‌ట‌. ఓ పాత్ర పేరు `పిచ్చి` అని మ‌రో పాత్ర పేరు అంబులి అని తెలుస్తోంది.  1960లో వ‌చ్చిన ఓ పీరియాడిక్ న‌వ‌ల ఆధారంగా ఈ మూవీని తెర‌కెక్కించ‌బోతున్నారు. నివ‌ధికంగా ఈ మూవీ కోసం భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేశార‌ట‌. ఈ మూవీ కోసం ఇప్ప‌టికే జ‌ల్లిక‌ట్టులో సూర్య ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకున్నాడు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కూడా ఎండింగ్ స్టేజ్ కి రావ‌డంతో అంద‌రి దృష్టి ఈ ప్రాజెక్ట్ వైపు మ‌ళ్లింది. దీంతో అంతా సూర్య ఈసారి గ‌ట్టిగానే ప్లాన్ చేస్తున్నాడా? అని కామెంట్ లు చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.