Begin typing your search above and press return to search.

సినిమాకి తగ్గకుండా అన్‌ స్టాపబుల్‌ కి బాలయ్య.. అందుకేనా ఇంత ఉత్సాహం?

By:  Tupaki Desk   |   6 Oct 2022 6:04 AM GMT
సినిమాకి తగ్గకుండా అన్‌ స్టాపబుల్‌ కి బాలయ్య.. అందుకేనా ఇంత ఉత్సాహం?
X
తెలుగు ఓటీటీ ఆహా కి మంచి ఆధరణ దక్కింది.. దక్కుతోంది అనడంలో బాలయ్య అన్‌ స్టాపబుల్‌ షో కీలక పాత్ర పోషించింది అనడంలో సందేహం లేదు. అన్‌ స్టాపబుల్‌ సీజన్ 1 తో ఆహా వ్యూవర్‌ షిప్ భారీగా పెరింది. అందుకే ఖాతాదారులు విపరీతంగా పెరిగారు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. అందుకే సీజన్‌ 2 కి అంతకు మించి అన్నట్లుగా ఏర్పాట్లు చేశారు.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి.

బాలయ్య అన్‌ స్టాపబుల్‌ సీజన్ 2 ప్రారంభ ఎపిసోడ్‌ లో నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ లు పాల్గొనబోతున్నారు. అందుకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. అతి త్వరలోనే షో ను స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇక ఈ సీజన్ కు బాలయ్య తీసుకున్న పారితోషికం చాలా ఎక్కువ అన్నట్లుగా సమాచారం అందుతోంది. బాలయ్య తో దాదాపుగా 15 నుండి 20 ఎపిసోడ్‌ లను ఈ సీజన్ కు గాను చిత్రీకరించే ఉద్దేశ్యంతో ఆహా టీమ్‌ ఉంది. అందుకు గాను బాలయ్య కాస్త ఎక్కువగానే పారితోషికం తీసుకుంటున్నాడట.

సినిమాల్లో నటిస్తే ఏ స్థాయిలో పారితోషికం తీసుకుంటాడో కాస్త అటు ఇటుగా అంతే పారితోషికం సీజన్ 2 కి తీసుకుంటున్నాడట. సీజన్‌ 1 కి తీసుకున్న పారితోషికంతో పోల్చితే సీజన్ 2 పారితోషికం దాదాపుగా మూడు రెట్లు అదనం అనే ప్రచారం కూడా జరుగుతోంది. బాలయ్య కు ఆ మాత్రం పారితోషికం ఇవ్వడం సమంజసమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ప్రస్తుతం బాలయ్య అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆహా లో అన్‌ స్టాపబుల్‌ సీజన్ 2 ఎప్పుడు స్ట్రీమింగ్‌ అవుతుంది.. అంతే కాకుండా చిరంజీవి ఒక ఎపిసోడ్‌ లో వస్తాడు అంటున్నారు.. అది ఎప్పుడు జరగబోతుంది అంటూ చర్చించుకుంటున్నారు.

బాలయ్య ఈ సీజన్ ను మరింత రచ్చ చేసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. భారీ పారితోషికంకు తగ్గట్లుగానే బాలయ్య ఎంటర్‌ టైన్మెంట్‌ ను ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాలయ్య సినిమాల విషయానికి వస్తే గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది.. మరో వైపు అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టాల్సి ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.