Begin typing your search above and press return to search.

ఇద్దరు యంగ్‌ స్టార్స్ తో బాలయ్య అన్‌ స్టాపబుల్‌

By:  Tupaki Desk   |   10 Oct 2022 11:39 AM GMT
ఇద్దరు యంగ్‌ స్టార్స్ తో బాలయ్య అన్‌ స్టాపబుల్‌
X
నందమూరి బాలకృష్ణ అన్‌ స్టాపబుల్‌ సీజన్ 2 మొదటి ఎపిసోడ్‌ కి డేట్ వచ్చేసింది. మొదటి ఎపిసోడ్‌ లో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కనిపించబోతున్నారు. చాలా రోజులుగా ఈ విషయం ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆహా వారు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి మరీ ప్రకటించారు. ఆ బిగ్‌ ఎపిసోడ్‌ కోసం ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రతి శుక్రవారం కూడా ఈ ఎపిసోడ్‌ ను కొత్త గెస్ట్ లతో స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. ఈ వారం చంద్రబాబు నాయుడు గెస్ట్‌ గా రాబోతున్న అన్‌ స్టాపబుల్‌ షో లో వచ్చే వారం డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ మరియు ఫలక్‌ నుమా దాస్ హీరో విశ్వక్ సేన్ లు హాజరు అవ్వబోతున్నారు.

ఇప్పటికే రెండవ ఎపిసోడ్‌ కి సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి అంటూ ఆహా టీమ్‌ నుండి అనధికారిక సమాచారం అందుతోంది.

బాలకృష్ణ మరియు యంగ్‌ హీరోస్ ఇద్దరు కలిసి ఏ స్థాయిలో రచ్చ చేస్తారో ఊహించుకోవచ్చు. యంగ్‌ హీరోలతో కూర్చున్న సమయంలో బాలయ్య కూడా యంగ్‌ గా మారిపోయి.. వారితో కలిసి పోయి ముచ్చట్లు పెట్టడం గత సీజన్ లోనే చూశాం. తప్పకుండా రెండవ ఎపిసోడ్‌ కూడా రచ్చ చేయడం పక్కా అన్నట్లుగా బాలయ్య అభిమానులు ఇప్పటి నుండే వెయిట్ చేస్తున్నారు.

బాలయ్య గత సీజన్ లో ఎంత ఎంటర్‌ టైన్మెంట్‌ ను అయితే అందించాడో అంతకు మించిన ఎంటర్‌ టైన్‌మెంట్‌ ను అందించేందుకు ఆహా టీమ్‌ తో కలిసి ఫుల్‌ గా ఎఫర్ట్‌ పెడుతున్నట్లుగా తెలుస్తోంది.

తప్పకుండా భారీ అంచనాలున్న ఈ షో మొదటి ఎపిసోడ్‌ తోనే ఫలితం ఏంటో తేలిపోయే అవకాశం ఉంది. ఇక ఈ సీజన్ చివరి ఎపిసోడ్‌ ను పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తో ప్లాన్‌ చేశారనే వార్తలు వస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.