Begin typing your search above and press return to search.
వెరైటీ పాత్రలతో ఆకట్టుకుంటున్న టాలీవుడ్
By: Tupaki Desk | 4 Jan 2017 11:00 PM ISTసినిమాల్లో కొత్త తరహా పాత్రలు కనిపించడం సాధారణమే. కానీ లీడ్ పాత్రలను వికలాంగులుగా చూపిస్తూ.. తీసే సినిమాలు మాత్రం అరుదుగానే వస్తుంటాయి. గతంలో ఇలాంటి ప్రయోగాలు జరిగినా.. ప్రస్తుతం మళ్లీ ఇలాంటి కల్చర్ ఊపందుకుంటోంది. బాలీవుడ్ లో కాబిల్ మూవీలో హృతిక్ రోషన్.. అంధుడి పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. లవ్ యాక్షన్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఇలాంటి రోల్స్ కు ఆదరణ పెరుగుతోంది. వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న మూవీ అందగాడు. ఇందులో రాజ్ తరుణ్ ఇందులో గుడ్డివాడుగా నటిస్తున్నాడు. పూర్తిగా కాదు కానీ.. దాదాపు ఇంటర్వెల్ వరకూ ఇలాగే ఉంటుందిట హీరో కేరక్టర్. మరోవైపు రవితేజ కూడా ఇలాంటి రోల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో మాస్ మహరాజ్ అంధుడి పాత్రనే చేస్తున్నాడు.
పూర్తిగా యాక్షన్ బేస్డ్ గా సాగే ఈ స్క్రిప్ట్ ఇప్పటికే పలు చేతులు మారి రవితేజ దగ్గరకు వచ్చింది. సబ్జెక్ట్ పై నమ్మకం ఉన్నా.. హీరో గుడ్డివాడు అంటే ఆ రోల్ చేయడానికి చాలా మంది భయపడ్డారు కానీ.. రవితేజ మాత్రం డేర్ చేస్తున్నాడు. మరోవైపు.. మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఒప్పం కూడా ఇదే కాన్సెప్ట్ తో తెరకెక్కగా.. తెలుగులో ఈ చిత్రం కనుపాప పేరుపై రిలీజ్ కానుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/