Begin typing your search above and press return to search.

బేబ‌మ్మ రిప్లై కోసం ఆ స్టార్ హీరో వెయిటింగ్ అట‌!?

By:  Tupaki Desk   |   15 March 2022 7:30 AM GMT
బేబ‌మ్మ రిప్లై కోసం ఆ స్టార్ హీరో వెయిటింగ్ అట‌!?
X
`సూపర్ 30` అనే హిందీ మూవీతో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన కృతి శెట్టి.. మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `ఉప్పెన‌`తో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది. 2021 ఫిబ్రవరి 12న విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

ఇందులో బేబ‌మ్మ‌గా మ్యాజిక్ సృష్టించి ప్రేక్ష‌కుల‌ను మిస్మ‌రైజ్ చేసిన కృతి శెట్టి.. త‌న రెండో ప్ర‌య‌త్నంగా శ్యామ్ సింగ‌రాయ్ చేసింది.

ఆపై అక్కినేని నాగ‌చైత‌న్య‌కు జోడీగా బంగార్రాజు సినిమాలో న‌టించింది. ఇటీవ‌లె విడుద‌లైన ఈ రెండు చిత్రాలు మంచి విజ‌యం సాధించాయి. వ‌రుస‌గా మూడు హిట్లతో హ్యాట్రిక్ కొట్టేసి టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ ముద్దుగుమ్మగా మారిపోయిన కృతి శెట్టి.. ప్ర‌స్తుతం ఇంద్రగంటి మోహన కృష్ణ ద‌ర్శ‌క‌తంలో సుధీర్ బాబు స‌ర‌స‌న `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` చిత్రం చేస్తోంది.

అలాగే రామ్ పోతినేనితో `ది వారియర్`, నితిన్‌తో `మాచర్ల నియోజకవర్గం` సినిమాల్లో సైతం న‌టిస్తోంది. మొత్తానికి కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్న కృతి శెట్టికి తాజాగా మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. విభిన్న‌మైన‌ క‌థ‌ల‌ను ఎంచుకుంటూ స‌త్తా చాటుతున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య‌.. ఈ మ‌ధ్యే `ఎవరికీ తలవంచడు(ఈటి)`తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.

కానీ, భారీ అంచ‌నాల న‌డుమ రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. ఇక‌పోతే సూర్య త‌న త‌దుప‌రి చిత్రాన్ని బాల దర్శకత్వంలో చేయ‌నున్నాడు. రామేశ్వ‌రంలో ఏప్రిల్ మొద‌టి వారం నుంచి ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకోనుంది. అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా కృతి శెట్టిని తీసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌.

ఇప్ప‌టికే ఆమెను సంప్ర‌దించి క‌థ కూడా వివ‌రించార‌ట‌. అయితే కృతి శెట్టి త‌న నిర్ణయం మాత్రం ఇంకా చెప్ప‌లేద‌ట‌. దీంతో ఇప్పుడు ఆమె రిప్లై కోసం హీరో సూర్య మ‌రియు మూవీ టీమ్ వెయిటింగ్‌ చేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి బేబ‌మ్మ‌ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నెల్ ఇస్తే.. కోలీవుడ్‌లో ఇదే ఆమెకు డెబ్యూ ఫిల్మ్ అవుతుంది.