Begin typing your search above and press return to search.
స్టార్ ఫిల్మ్ మేకర్ క్షమాపణ చెప్పాల్సిందే
By: Tupaki Desk | 29 Oct 2020 11:20 PM ISTఈ మద్య కాలంలో వరుసగా వివాదాలను ఎదుర్కొంటున్న స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. గోవా ప్రభుత్వం ఆయనకు క్షమాపణ చెప్పాలంటూ అల్టిమేటం జారీ చేసింది. ఒక సినిమా షూటింగ్ సందర్బంగా గోవా రాష్ట్రంలో ఒక గ్రామంను చెత్తమయంగా చేసినందుకు గాను కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ పై ఫిర్యాదు నమోదు అయ్యింది. సోషల్ మీడియా ద్వారా స్థానికులు కొందరు గ్రామంలో ధర్మ ప్రొడక్షన్స్ వారు వదిలి వెళ్లిన చెత్తను ఫొటోలు వీడియోలు తీసి షేర్ చేశారు. దాంతో గోవా ప్రభుత్వం మరియు అధికారులు సీరియస్ గా స్పందించారు.
గోవా వ్యర్థ పదార్థాల నిర్వహణ మంత్రి మైఖేల్ లోబో మాట్లాడుతూ ధర్మ ప్రొడక్షన్ వారు చెత్త పడేసి వారి దారిన వారు వెళ్లి పోయారు. ఇందకు గాను వారు రాష్ట్ర ప్రజలు అందరికి క్షమాపణ చెప్పాల్సిందే. లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా వారు క్షమాపణ చెప్పాలి. లేదంటే వారు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కూడా పేర్కొన్నారు.
ఈ సంఘటనపై ధర్మ ప్రొడక్షన్స్ లైన్ ప్రొడ్యూసర్ దిలీప్ మాట్లాడుతూ మేము గోవాలోని నిరుల్ ప్రాంతంలో షూటింగ్ చేసిన విషయం నిజమే. మేము ప్రతి రోజు షూటింగ్ తర్వాత చెత్తను పంచాయితీ వారు చెప్పిన ప్రాంతంలో వేసేవాళ్లం. కాని ఆదివారం నాడు చెత్త సేకరణకు వాహనం రాకపోవడంతో అలాగే ఉండి పోయింది. ఆ విషయంకు మేము చింతిస్తున్నాం అంటూ ఆయన పేర్కొన్నాడు. ఈ విషయమై ధర్మ ప్రొడక్షన్స్ అధినేత అయిన కరణ్ జోహార్ స్పందించాల్సిందే అంటూ చాలా మంది నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.