Begin typing your search above and press return to search.
#కరోనా.. 27 కోట్లు విరాళమిచ్చిన ఏకైక స్టార్ హీరో
By: Tupaki Desk | 1 Oct 2020 11:00 AM ISTకిలాడీ అక్షయ్ కుమార్ దానధర్మాల గురించి తెలిసిందే. ఆపత్కాలంలో వెంటనే స్పందించి భారీ విరాళాలు ఇవ్వడం ఆయన ప్రత్యేకత. బాలీవుడ్ లో ఖాన్ ల కంటే గొప్ప మనుసున్న హీరోగాను అసాధారణ ఆర్జన ఉన్న టాప్ హీరోగానూ పాపులరైపోయాడు. తండ్రి ఆర్మీలో ఉన్నతాధికారి కావడంతో స్వతహాగానే అక్కీ దేశభక్తుడు. అందుకే దేశానికి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందిస్తుంటాడు. విరివిగా ప్రభుత్వానికి విరాళాలిస్తుంటాడు. మోదీ ప్రభుత్వానికి ఆయన వెన్నంటి నిలిచిన సంగతి విధితమే.
కరోనా కష్ట కాలంలో ఏకంగా 24 కోట్ల నిధిని కోవిడ్ వైద్యం కోసం అందించాడు. కోవిడ్ కాలంలో పేదల సంక్షేమం కోసం ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవడానికి భారత ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చాడు. తాజా సమాచారం ప్రకారం.. బిఎంసి(ముంబై)కి 3 కోట్లు విరాళం ఇచ్చాడని తెలుస్తోంది. ఈ నిధితో కోవిడ్ ఆపత్కాలంలో ఆదుకునేందుకు శ్రమిస్తున్న కార్మికుల కోసం ఎక్కువ పిపిఇ కిట్లు తయారు చేయడానికి క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఈ నిధి ఉపయోగించాలని అక్కీ కోరారట. మొత్తంగా 24కోట్లు కోవిడ్ బాధితులకు.. 3కోట్లు ముంబై ఉద్యోగులకు.. ఇస్తున్నారు కాబట్టి అక్కీ డొనేషన్ 27కోట్లకు చేరినట్టయ్యింది.
కష్టకాలంలో దేశ ప్రజల కోసం అక్షయ్ ప్రతిసారీ ముందుకు వస్తాడు. ఇక కెరీర్ సంగతి చూస్తే అక్షయ్ నటించిన లక్ష్మీ బాంబ్ ఓటీటీ లో రిలీజవుతోంది. అలానే పలు దేశాల్లో థియేట్రికల్ రిలీజ్ చేస్తున్న తొలి భారతీయ సినిమాగానూ ఇది రికార్డులకెక్కుతోంది. దీంతో పాటు ఇతర ప్రాజెక్టులపైనా ఆయన పని చేస్తున్నారు.