Begin typing your search above and press return to search.

స్కేటింగ్ చేస్తూ కిందపడిన హీరోయిన్.. తర్వాత ఏమందంటే??

By:  Tupaki Desk   |   9 March 2021 10:27 PM IST
స్కేటింగ్ చేస్తూ కిందపడిన హీరోయిన్.. తర్వాత ఏమందంటే??
X
హీరోయిన్ జెనెలియా అంటే తెలుగు ప్రేక్షకులు ఈజీగా హాసిని అని గుర్తుకు తెచ్చుకుంటారు. సినిమాలలో ఎంతో బబ్లీ క్యారెక్టర్స్ చేసిన జెనిలియా నిజానికి చాలా డేర్. ఆమె తన ఫెయిల్యూర్స్ ఫేస్ చేయడానికి అసలు భయపడదు. తాజాగా ఆమె అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన ఫెయిల్యూర్స్ చూపించాలని రెడీ అయింది. జెన్నీ స్కేటింగ్ నేర్చుకునేటప్పుడు తనకు కలిగిన గాయం గురించి ఇంస్టాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోతో పాటు ఇలా రాసుకొచ్చింది. "నా రికవరీ పావ్రీ స్టోరీ. కొన్నివారాల క్రితం నేను స్కేటింగ్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నేను నా పిల్లలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని అనుకుంటున్నాను. అలాగే ఇంస్టాలో కూడా ఓ మంచి వీడియో పోస్ట్ చేయాలనీ భావించాను.

ఇంస్టాగ్రామ్ ఎల్లప్పుడూ సక్సెస్ స్టోరీస్ మాత్రమే చూపిస్తుంది. కానీ స్కేటింగ్ చేసే సమయంలో మనం ఎలా పడిపోతామో తెలుసు కదా.. కొన్నిసార్లు ముందే పడిపోతాం. కానీ నేను ధృడంగా నిర్ణయించుకున్నాను. నేను స్కేటింగ్ లో సక్సెస్ అయ్యేవరకు ప్రయత్నిస్తాను. అలాగే అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు' అంటూ పోస్ట్ చేసింది. స్కేటింగ్ గేర్‌లో, గదిలోని ఒక పాయింట్ నుండి బయలుదేరిన జెనెలియాను వీడియోలో చూడవచ్చు. వీడియో తీస్తున్న వ్యక్తి ఆమెకు సూచనలు ఇస్తున్నాడు. ఆమె కదులుతున్నప్పుడు వేగం పెరిగి ముందుకు వెళ్ళాక కిందపడటంతో ఆమె ఎడమ చేయికి గాయమైంది. ఫస్ట్ ఈ వీడియో చూసి చాలామంది ఫ్యాన్స్ కంగారుపడ్డారు. వెంటనే సోషల్ మీడియాలో జెన్నీ త్వరగా చేయి రికవరీ కావాలని ఆశిస్తూ కామెంట్స్ రాసారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో జెన్నీ - రితేష్ కపుల్ ఒకటి. త్వరలో జెన్నీ మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.