Begin typing your search above and press return to search.

పాము కాటుకు మందు ఇస్తున్న హీరోయిన్

By:  Tupaki Desk   |   22 Nov 2021 4:18 AM GMT
పాము కాటుకు మందు ఇస్తున్న హీరోయిన్
X
జైభీమ్ చిత్రంలో సిన‌త‌ల్లి పాత్ర‌లో న‌టించింది మ‌ల‌యాళీ న‌టి లిజోమోల్ జోస్. గ‌ర్భం నిండి అష్ట‌కష్టాలు అనుభ‌వించే గిరిజ‌న యువ‌తిగా లిజో న‌టన కంట తడి పెట్టిస్తుంది. ఎరుక‌ల‌(గిరిజ‌న‌) క‌మ్యూనిటీకి చెందిన మ‌హిళ‌గా డీగ్లామ‌ర‌స్ పాత్ర‌లో ఒదిగిపోయి న‌టించిన తీరుకు జ‌నం నీరాజ‌నాలు ప‌లికారు. ఈ ఏడాది లిజో న‌ట‌న‌కు అవార్డులు ఖాయం అన్న చ‌ర్చా సాగింది. ఈ సినిమా ఓటీటీలో గొప్ప ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో వృత్తిగ‌త నిబ‌ద్ధ‌త గురించి లిజో చెప్పిన మాట‌లు షాక్ కి గురి చేసాయి. తాను గిరిజ‌న యువ‌తిలా మారేందుకు చాలా శ్ర‌మించాన‌ని గిరిజ‌న గూడేల‌కు వెళ్లాన‌ని కూడా తెలిపారు. గిరిజ‌నుల సంస్కృతి కట్టు బొట్టు ఆహార్యం అన్నీ స్వ‌యంగా ద‌గ్గ‌ర‌గా చూసి నేర్చుకున్నానని అన్నారు. త‌న పాత్ర‌కు చ‌క్క‌ని పేరొచ్చింద‌ని లిజో తెలిపారు.

పాము కాటుకు మందు ఇవ్వ‌డం నేర్చుకున్నాన‌ని లిజోమోల్ జోస్ వెల్ల‌డించారు. అంతేకాదు గిరిజ‌నుల‌తో పాటు ఎలుక‌ల కూర తిన్నాన‌ని చికెన్ తిన్న‌ట్టు ఉంద‌ని బిగ్ షాకిచ్చింది. ఎంపిక చేసుకున్న పాత్ర‌లోకి ప‌ర‌కాయం చేసేందుకు లిజో చేసిన ఈ సాహసాలు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. ఎలుక‌ల కూర‌ను చికెన్ లా ఆర‌గించ‌డం ఎంతైనా విడ్డూర‌మే!