Begin typing your search above and press return to search.

టీజర్ టాక్ః గల్లీ టూ గ్యాంగ్ లీడర్

By:  Tupaki Desk   |   1 Dec 2017 9:30 AM IST
టీజర్ టాక్ః గల్లీ టూ గ్యాంగ్ లీడర్
X
తెలుగులో స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్న నటుడు సూర్య. సింగం సినిమాతో సూర్యకు తెలుగులోనూ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఆ తరవాత చేసిన సినిమాలన్నీ మూస కథలు.. తమిళ నేటివిటీ ఉన్న స్టోరీలు చేయడంతో ఇక్కడ సూర్య సినిమాలకేు క్రమేపీ క్రేజ్ తగ్గుతూ వచ్చింది. సింగమ్-3 పెద్దగా అట్రాక్ట్ చేయకపోవడంతో సూర్య పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సూర్య తాజాగా విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో ‘తానా సెరెంద కూట్టమ్‌’ సినిమా చేస్తున్నాడు. హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన స్పెషల్ ఛబ్బీస్ సినిమాకు ఇది అఫీషియల్ రీమేక్. హ్యూమర్ కలగలిసున్న థ్రిల్లర్ కథాంశమిది. ఇందులో కీర్తి సురేశ్‌ హీరోయిన్ కాగా.. సీనియర్ నటులు రమ్యకృష్ణ - కార్తీక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ఇందులో సూర్య రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. ఇందులో ఒకటి గల్లీలో నివసించే మాస్ యువకుడిగా గడ్డంతో కనిపించాడు. మళ్లీ సీబీఐ ఆఫీసర్ గా అఫీషియల్ లుక్ లో అదరగొట్టాడు. అనిరుధ్‌ రవిచందర్‌ దీనికి మ్యూజిక్ డైరెక్టర్. మాస్‌ బీట్‌ తో అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ బాగానే ఆకట్టుకుంటుంది.

‘తానా సెరెంద కూట్టమ్‌’ గ్యాంగ్ పేరుతో తెలుగులోనూ విడుదల కానుంది. ప్రభాస్ తో సాహో చిత్రాన్ని నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్‌ దీని రైట్స్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా కాన్సెప్టు ఆకట్టుకుకునేది కావడంతోపాటు తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న రమ్యకృష్ణ లాంటి సీనియర్ నటి కీలక పాత్ర పోషించడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. అరవ నేటివిటీ అతిగా చూపించకుండా ఉంటే గ్యాంగ్ సినిమాకు ఇక్కడ ఆదరణ లభించే అవకాశముంది.