Begin typing your search above and press return to search.

సుశాంత్ ది హత్యే.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   16 Sept 2020 5:40 PM IST
సుశాంత్ ది హత్యే.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X
బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి ఆది నుంచీ సంచలనంగానే మారింది. సుశాంత్‌ చనిపోయి మూడు నెలలు దాటినా రోజుకో తీరుగా మలుపుతిప్పుతోంది. ముందుగా అతడిది ఆత్మ హత్య గానే అందరూ భావించారు. కానీ.. ఆ తర్వాత అతని కుటుంబ సభ్యులు హత్య అంటూ అనుమానించారు. బాలీవుడ్‌ లోని ఒక వర్గం అతడిని ఒత్తిడి లోకి నెట్టిందని.. సుశాంత్‌ లవర్‌‌ రియా వల్లే అతను చని పోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాజాగా.. మహారాష్ట్రకు చెందిన భాజపా ఎమ్మెల్యే నితీష్ రాణె రిపబ్లిక్ టీవీ చానెల్‌ లో నిర్వహించిన చర్చలో సుశాంత్, అతడి మేనేజర్ దిశల మృతికి సంబంధించి సంచలన ఆరోపణలు చేశాడు. వాళ్లిద్దరివీ ఆత్మహత్యలు కావని, అవి హత్యలే అని, తన దగ్గర రుజువులు కూడా ఉన్నాయని.. ప్రస్తుతం సుశాంత్ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులను కూడా కలిసి ఆ ఆధారాలు సమర్పిస్తానని ఆయన వ్యాఖ్యానించారు.

జూన్ 8న సుశాంత్ మేనేజర్ దిశ ఆత్మహత్యకు పాల్పడిందని.. దాని కంటే ముందు ఆమె ఇష్టం లేకుండా ఒక పార్టీలో పాల్గొందని.. అక్కడ ఆమెకు చేదు అనుభవం ఎదురైందని తెలిపారు. దీని గురించి సుశాంత్‌కు ఫోన్ చేసిందని.. అతను రియాకు విషయం చెప్పాడని వెల్లడించాడు. రియా దిశను ఇబ్బంది పెట్టిన వ్యక్తులకు ఫోన్ చేసి అంతా వివరించడంతో దిశ తన ఫ్లాట్‌ కు వచ్చే సరికి ఓ వ్యక్తి అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడని.. అతనే దిశ మరణానికి కారణమని నితీష్ రాణె ఆరోపించాడు.

దిశ చనిపోయిన రోజే రియా ఉన్న పళంగా సుశాంత్‌ ఇంటి నుంచి వెళ్లి పోయిందని చెప్పారు. తర్వాత ఐదు రోజులకే సుశాంత్‌ కూడా మరణించాడని, అతడి మృతి వెనుక కూడా కొన్ని శక్తులు పని చేశాయని ఆరోపించాడు.