Begin typing your search above and press return to search.

తెలుగోళ్లు దేనికైనా గౌరవిమిస్తారు -సూర్య

By:  Tupaki Desk   |   18 April 2016 7:07 PM IST
తెలుగోళ్లు దేనికైనా గౌరవిమిస్తారు -సూర్య
X
''తెలుగు ప్రజలు.. తెలుగు ఆడియన్స్‌.. కొత్తగా ఏం ప్రయత్నించినా కూడా ఒక రెస్పక్ట్‌ అనేది ఇస్తారు. మీకు తెలియంది కాదు.. ఒక శంకరాభరణం.. అన్నమయ్య.. ఈగ.. బాహుబలి.. ఏ సినిమా అయినా కూడా ప్రేక్షకులు ఆదరించారు. దేవుళ్ళ సినిమాలను కూడా ఇక్కడ కమర్షియల్‌ సినిమాల టైపులోనే చూస్తారు. అదే తెలుగు ప్రజల గొప్పదనం'' అంటూ చెప్పుకొచ్చాడు హీరో సూర్య. మనమేమో మనోళ్ళు కొత్త రకం సినిమాలను చూడరు అంటూ కామెంట్లు చేసుకుంటూ ఉంటే.. సూర్య ఏందబ్బా ఇలా చెబుతున్నాడు?

నాలుగున్నర గంటల నెరేషన్‌ విన్న తరువాత ''24'' సినిమాను నేను ప్రొడ్యూస్‌ చేయాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చాడు సూర్య. అయితే సినిమాలో 5 రోల్స్‌ నువ్వే ఎందుకు చేశావ్‌ నాయనా అంటే.. ఎవరూ చేయను అన్నారు కాబట్టి అంటున్నాడు. ''ఇద్దరు ట్విన్‌ బ్రదర్స్‌.. ఒక కొడుకు.. ఐదు లుక్స్‌.. అయితే నా కొడుకుగా కనిపించడానికి ఏ హీరో ఒప్పుకోరు. అలాగే తండ్రి క్యారెక్టర్‌ చేయడానికీ ఎవ్వరూ ముందుకు రాలేదు. సో.. అన్నీ నేనే చేయాల్సి వచ్చింది. ఇంకా నయం.. మా డైరక్టర్‌ విక్రమ్‌ నన్ను ఒక హీరోయిన్‌ రోల్‌ కూడా చేయించేవాడు. కన్విన్స్‌ చసేస్తాడతడు. కాని ఆ ఒక్క విషయంలో వదిలేశాడు'' అంటూ చెప్పాడు సూర్య. మే 6న విక్రమ్‌ కె కుమార్‌ డైరక్షన్‌ లో రూపొందిన ''24'' విడుదలవుతోంది.