Begin typing your search above and press return to search.

ఎద్దులతో ఫైటింగ్ లో శిక్షణ పొందిన సూర్య‌

By:  Tupaki Desk   |   14 July 2021 5:30 PM GMT
ఎద్దులతో ఫైటింగ్ లో శిక్షణ పొందిన సూర్య‌
X
ఆడుక‌ళం- విసరణై- వ‌డ‌ చెన్నై- అసురన్ వంటి అవార్డులు గెలుచుకున్న చిత్రాల‌తో వెట్రీ మారన్ మంచి పేరు తెచ్చుకున్నారు. అత‌డు ప్ర‌స్తుతం జ‌ల్లిక‌ట్టు నేప‌థ్యంలో ఓ ఆస‌క్తిక‌ర సినిమాకి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప‌వ‌ర్ ప్యాక్డ్ పెర్ఫామ‌ర్ సూర్య క‌థానాయకుడిగా న‌టిస్తుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

`వాడి వాసల్` అనేది ఈ సినిమా టైటిల్. గత‌ సంవత్సరం ఈ సినిమాని ప్ర‌క‌టించారు. ఎట్ట‌కేల‌కు చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లేందుకు స‌మ‌య‌మాస‌న్న‌మైంది. చెన్నై వ‌ర్గాల క‌థ‌నం ప్రకారం.. వాడీ వాసల్ చిత్రాన్ని సాధ్య‌మైనంత వేగంగా పూర్తి చేయాల‌న్న‌ది సూర్య‌-వేట్రి ప్లాన్. ఆ మేర‌కు సూరియా వెట్రీ మారన్ ను అభ్యర్థించారు. ఇక క‌థాంశం ప్ర‌కారం.. సూర్య త‌న పాత్ర కోసం మానసికంగా శారీరకంగా ప్రిప‌రేష‌న్ సాగిస్తున్నారు.

ఈ చిత్రం జల్లి కట్టు ఉత్సవాల నేప‌థ్యంలో ఉంటుంది. సూర్య జ‌ల్లిక‌ట్టు దృశ్యాలలో ఎక్కువ‌గా క‌నిపిస్తారు. కానీ ఇది స‌వాళ్ల‌తో కూడుకున్న‌ది. అందుకే రాజీకి రాకుండా ప‌ర్ఫెక్ష‌న్ కోసం ఎద్దులతో లైవ్ లీగా శిక్ష‌ణ తీసుకుంటున్నార‌ని తెలిసింది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి. వేట్రి మార‌న్ ప్రస్తుతం `విదుతలై` పనులను ముగించాడు. త‌దుప‌రి త్వరగా వాడి వాసల్ ను సెట్స్ కి తీసుకువెళతాడు. కలైపులి ఎస్ థాను V క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జ‌ల్లిక‌ట్టు నేప‌థ్యంలో ఇంత‌కుముందు త‌మిళంలో చాలా సినిమాలొచ్చాయి. విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ స‌హా ప‌లువురు స్టార్ హీరోలు జ‌ల్లిక‌ట్టు నేప‌థ్య చిత్రాల్లో న‌టించారు. కానీ ఇప్పుడు వాటికంటే విభిన్నంగా ఏం చూపిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రం.

ప్రస్తుతం సూరియా తన తొలి నెట్ ఫ్లిక్స్ మూవీ `నవరస` కోసం వ‌ర్క్ చేస్తున్నారు. ఇంత‌కుముందు ట్రైల‌ర్ రిలీజై ఆక‌ట్టుకుంది. అలాగే పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలోనూ అత‌డు ఓ సినిమా చేస్తున్నారు.

సూర్య మ‌రోవైపు టాలీవుడ్ లో స్ట్రెయిట్ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో కానీ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో కానీ అత‌డు తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు ఆస్కారం ఉంది. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంట‌ర్ టైన్ మెంట్స్ టాలీవుడ్ లోనూ సినిమాలు నిర్మించే ప్లాన్ చేస్తోంద‌ని .. తెలుస్తోంది.

గ‌జిని సింగం డేస్ ఎప్ప‌టికి?

ఇటీవ‌ల చాలా కాలంగా సూర్య కెరీర్ ప‌రంగా డైలమాలో ప‌డిపోయారు. `ఆకాశం నీ హ‌ద్దురా` చిత్రంతో విజ‌యం అందుకునే వ‌ర‌కూ వ‌ర‌స ఫ్లాపులు అత‌డిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. `సింగం` ఫ్రాంఛైజీ చిత్రాలు మాత్ర‌మే టాలీవుడ్ లో బాగా ఆడాయి. ఆ త‌ర్వాత చాలా సినిమాలు ఫ్లాపుల‌వ్వ‌డంతో అతడి మార్కెట్ కూడా త‌గ్గింది. కానీ ఎయిర్ డెక్క‌న్ అధినేతి జీఆర్ గోపీనాథ్ జీవిత‌ క‌థతో తెర‌కెక్కిన‌ `ఆకాశం నీ హ‌ద్దురా` చిత్రంలో న‌టించాక అత‌డి ద‌శ తిరిగిన‌ట్టే క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ క్రేజీ చిత్రాల్లో న‌టిస్తున్నారు. మ‌రోవైపు వెబ్ సిరీస్ ల‌పైనా సూర్య దృష్టి సారించారు. నిర్మాత‌గానూ మ‌రోవైపు అత‌డు తెలివైన ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు సాగుతున్నారు.