Begin typing your search above and press return to search.
సూర్య గొప్ప మనసుకి హ్యాట్సాఫ్
By: Tupaki Desk | 5 April 2016 1:08 PM ISTరోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని సెలబ్రెటీలు తమ కార్లో ఎక్కించుకెళ్లి ప్రాణాలు కాపాడిన ఘటనలు ఎప్పుడైనా విన్నామా..? అదేదో సినిమాలో చూపించినట్లు రక్తపుమరకలతో కారు పాడవుతుందని అనుకుంటారు చాలామంది సెలబ్రెటీలు. ఐతే తమిళ స్టార్ హీరో సూర్య మాత్రం తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. ఓ ప్రమాదంలో గాయపడిన మహిళ రోడ్డు మీద పడి ఉంటే.. తన కారు ఎక్కించి ఆమెను ఆసుపత్రికి చేర్చాడు. ఇది జరిగింది తెలుగు రాష్ట్రంలో కావడం విశేషం. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
తన కొత్త సినిమా '24' షూటింగులో భాగంగా సూర్య.. మదనపల్లె మండలంలోని ఈడిగపల్లెకు వచ్చాడు. గ్రామ సమీపంలోని క్వారీ వద్ద సోమవారం పొద్దుపోయే వరకు షూటింగులో పాల్గొన్నాడు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో సూర్య మదనపల్లెకు బయలుదేరాడు. ఐతే మార్గమధ్యంలో వలసపల్లె వద్ద ఓ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన మహిళ రోడ్డుపై పడి ఉంది. ఈ సంగతి గుర్తించిన సూర్య.. ఆ మహిళను తన వాహనంలో ఎక్కించుకొని..మదనపల్లెకు తీసుకొచ్చాడు. ఆసుపత్రిలో చేర్పించాడు. తర్వాత అక్కడి నుంచి హోటల్ కు చేరుకున్నాక కూడా ఆ మహిళ పరిస్థితిపై ఆరా తీశాడు. సూర్య చూపించిన దాతృత్వం మదనపల్లెలో పెద్ద చర్చనీయాంశమైంది. ఐతే ఈ సంగతి మంగళవారం ఉదయం స్థానిక పత్రికల్లో వచ్చేదాకా బయటి ప్రపంచానికి తెలియలేదు.