Begin typing your search above and press return to search.
వీలైనంత సాయం చేయండని ఫ్యాన్స్ ని రిక్వెస్ట్ చేసిన స్టార్ హీరో...!
By: Tupaki Desk | 12 Jun 2020 8:00 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరితమే. తన సినిమాలతోనే కాకుండా తన సేవాగుణంతో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు. సూర్య ఒక్కడే కాకుండా తన కుటుంబం మొత్తం సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటుంది. సూర్య భార్య జ్యోతిక, తండ్రి శివ కుమార్, తమ్ముడు కార్తి కూడా సేవా కార్యక్రమాల్లో ముందే ఉంటారు. 'అగరం ఫౌండేషన్' ని ఏర్పాటు చేసి అనేక మంది పేద విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులకు గురవుతున్న వారిని ఆదుకోవడానికి కూడా వీరు ముందు వరుసలోనే ఉన్నారు. దక్షిణ భారత సినీ కార్మికులకు ముందుగా ఆర్థిక సహాయాన్ని అందించింది కూడా సూర్య కుటుంబమే. సూర్య ఫ్యాన్స్ కూడా ఆయన బాటలోనే నడుస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కరోనా సమయంలో కూడా సూర్య అభిమానులు ఎందరో పేదలకు అనేక విధాలుగా సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు.
ఈ సందర్భంగా సూర్య తన అభిమానులకు ఒక విజ్ఞప్తి చేశారు. ''ఇలాంటి విపత్కర సమయంలో అభిమానులు నిరంతరం సేవా కార్యక్రమాలు పాల్గొనడం సాధారణ విషయం కాదని.. పేదలకు ఎంతవరకు సాయం చేయగలరో అంతవరకు చేయండని'' సూర్య అన్నారు. అయితే ఏ విధంగానూ తనకు బాధ కలిగించే పనులు మాత్రం చేయొద్దని కోరాడు. అదే విధంగా కొందరు ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని.. అలాంటివి సాధ్యమైనంత వరకు నిషేధించాలని సూచించాడు. నిరంతరం సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న తన అభిమానులను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు ఈ లేఖ ద్వారా పేర్కొన్నారు సూర్య.
ఇక సినిమాల విషయానికొస్తే ఈ మధ్య వరుస ఫెయిల్యూర్స్ తో తెలుగులో సూర్య మార్కెట్ క్రమంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని 'గురు' వంటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న లేడీ డైరెక్టర్ సుధా కొంగర డైరెక్షన్ లో 'సూరారై పొట్రు' అనే సినిమాను తెరకెక్కించేసాడు సూర్య. సామాన్యుడికి సైతం విమాన సౌకర్యం అందించిన ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' అనే పేరుతో విడుదలకానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. సెన్సార్ బోర్డు వారు ఎలాంటి కటింగ్స్ లేకుండా ఈ సినిమాకు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ జారీ చేశారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక థియేటర్లు తెరుచుకున్న వెంటనే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించిన సూర్య భావిస్తున్నారట.