Begin typing your search above and press return to search.

సూర్య స్టయిలే వేరయ్యా సామీ

By:  Tupaki Desk   |   18 April 2016 5:00 PM IST
సూర్య స్టయిలే వేరయ్యా సామీ
X
మామూలుగా మన హీరోలు కాని దర్శకులు కాని నిర్మాతలూ కాని అస్సలు మన సినిమాలను డబ్బింగ్‌ చేసి అక్కడ సరిగ్గా క్యాష్‌ చేసుకోలేకపోతున్నారనే సంగతి తెలిసిందే. అందుకే తాను సర్దార్‌ సినిమాను బాలీవుడ్‌ తీసుకెళ్ళా అన్నాడు పవన్‌. కాని మనోడు కూడా అక్కడి పెద్దలను ఇక్కడికి పిలిచి తన షూటింగ్‌ స్పాటులో ఇంటర్యూలు ఇచ్చాడే కాని.. వెళ్లి స్వయంగా ఇంటారాక్ట్‌ కాలేదు.

అయితే వీళ్ళందరూ తమిళ హీరో సూర్యను చూసి నిజంగానే చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ''24'' సినిమాను అటు తమిళంలో ఇటు తెలుగులో ఒకేసారి మే 6న విడుదల చేస్తున్న సూర్య.. టాలీవుడ్‌ లో మామూలుగా ప్రమోట్‌ చేయట్లేదు మరి. మనోడు ఆల్రెడీ పోస్టర్‌ లాంచ్‌ అంటూ ఒక ప్రెస్‌ మీట్‌ పెట్టాడు.. మొన్ననే ఆడియో లాంచ్‌ అంటూ ఏ.ఆర్‌.రెహ్మాన్‌ ను ఇక్కడకు తెచ్చాడు. ఇప్పుడేమో డేట్‌ ఎనౌన్సమెంట్‌ కోసం ఒక ప్రెస్‌ మీట్‌. ఏదో విధంగా మే 6 రిలీజ్‌ వరకు మీడియాను కలుస్తూనే ఉన్నాడు.

మూడుసార్లు హైదరాబాద్‌ వచ్చి ప్రెస్‌మీట్‌ పెట్టిన సూర్య.. మరో రెండు రోజుల్లో పేపర్లకూ.. టివిలకూ ఇంటర్యూలు కూడా ఇస్తాడట. ఆల్రెడీ తమిళంలో స్టార్‌ హీరో అయ్యుండీ అక్కడ రిలీజ్‌ తో బిజీగా ఉండి.. మనోడు మళ్ళీ ఇవన్నీ చేయడం సూపరే మరి. అందుకే అతగాడి సినిమాలకు అంత విజిబిలీటీ.. ఆ రేంజు కలక్షన్లు వస్తున్నాయి. ఏదైనా సూర్య స్టయిలే వేరు మరి. బాబూ తెలుగు హీరోలూ.. వింటున్నారా?