Begin typing your search above and press return to search.

ధూల్ పేట్ ఛాయల్లో సూర్య సినిమా

By:  Tupaki Desk   |   15 Feb 2019 5:53 AM GMT
ధూల్ పేట్ ఛాయల్లో సూర్య సినిమా
X
నిన్న ప్రేమికుల రోజు సందర్భంగా సినిమాలతో పాటు ఆన్ లైన్ టీజర్ల హడావిడి ఓ రేంజ్ లో జరిగింది. మనకు లక్ష్మీస్ ఎన్టీఆర్-మజిలీలతో సందడి నెలకొనగా తమిళ్ లో ఎన్జికె(నంద గోపాల కుమరన్)తో ఫాన్స్ పండగా చేసుకున్నారు. తెలుగు వెర్షన్ టీజర్ కూడా దానితో పాటే రిలీజైన సంగతి తెలిసిందే. హీరో సూర్య దర్శకుడు సెల్వ రాఘవన్ మొదటిసారి కాంబోగా మారి చేస్తున్న మూవీ కాబట్టి దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఎన్జికెకు సెల్వ గతంలో తీసిన ఓ మూవీతో పోలికలు రావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

13 ఏళ్ళ క్రితం ధనుష్ హీరోగా పుదుపెట్టై అనే సినిమా వచ్చింది. దానికి సెల్వ రాఘవన్ దర్శకుడు. స్లోగా మొదలై ఓ మోస్తరు విజయం సాధించిన తర్వాత క్లాసిక్ గా నిలిచిపోయిన ఈ పొలిటికల్ గ్యాంగ్ స్టర్ పోలికలు ఇప్పుడు ఎన్జికెలో ఉన్నాయని ఉదాహరణలతో సహా అభిమానులు పోస్ట్ చేస్తున్నారు. ఈ పుదుపెట్టైని తెలుగులో ధూల్ పేట్ పేరుతో అప్పట్లో డబ్ చేసారు. స్నేహ-కాజల్ అగర్వాల్ హీరోయిన్లు కావడంతో మనవాళ్లకూ రీచ్ అవుతుందన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఇక్కడ అంతగా వర్క్ అవుట్ అవ్వలేదు. చూద్దామన్నా తెలుగు వెర్షన్ ఆన్ లైన్ లో కానీ టీవీ ఛానల్స్ లో కానీ అందుబాటులో లేకపోవడం గమనార్హం.

ఓ మాములు వ్యక్తి గ్యాంగ్ స్టర్ గా ఎదిగి అటుపై రాజకీయాల్లోకి వచ్చే వ్యక్తిగా ధనుష్ పాత్రను సెల్వ తీర్చి దిద్దిన తీరు అప్పట్లో విమర్శకుల ప్రశంశలు అందుకుంది. ఇప్పుడు ఎన్జికె కూడా అదే తరహాలో ఉందంటూ సాక్ష్యాలు చూపడం హాట్ టాపిక్ గా మారింది. ఏదైతేనేం సూర్య ఇమేజ్ సాయి పల్లవి-రకుల్ ప్రీత్ సింగ్ ల గ్లామర్ లాంటి ఆకర్షణలు ఎన్జికె ను హాట్ కేక్ గా మారుస్తున్నాయి. విడుదల తేది ఇంకా ఖరారు కావలసిన ఎన్జికే సూర్య కెరీర్ లోనే హయ్యెస్ట్ బిజినెస్ జరుపుకుంటుందని అక్కడి ట్రేడ్ టాక్